న్యాయం కోసం పోరాడు:- కవిమిత్ర,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)
జాత్యాంహకారం  అధికమై
తాము చెప్పినదే  వేదమని
ఆత్మగౌరవానికి భంగం కలిగితే
తప్పక మేము మనుషులమే యని పోరాడు

అవినీతి అక్రమాలతో
సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న
నయవంచకులను ఎదురించు
జాతి గౌరవాన్ని దెబ్బతీసే వారి ఆగడాలను
సిరి వెన్నెల చెప్పినట్లు
నిగ్గుతీసి అడుగు ఈ. సిగ్గులేని సమాజాన్ని అని 
ధైర్యంగా ప్రశ్నించు.

నలుగురి మంచికోసం
ఎక్కడ చెడు ఉన్నా యుక్తాయుక్త విచక్షణ ఉన్న
ఓ మనిషీ ధైర్యంగా ప్రతిఘటిస్తే
నీవు అవుతావు ఆదర్శ మనీషివి....!!
.........................


కామెంట్‌లు