తన అందం ఏదో తనకు తెలియని
పసిపాప నవ్వులో సౌందర్యం
తన నెలవున తానుంటూ పరులకు
నిస్వార్థ సేవ చేయు ప్రకృతి అందం...
గలగల సాగే సెలయేటికి తెలుసా
ఎందరి దాహం తీర్చానో అని...
కళకళలాడే తరువుకు తెలుసా
ఎన్ని గువ్వలకు అవాసమయ్యానో అని..
చల్లగా వీచే చిరుగాలికి తెలుసా
ఎన్ని జీవాలకు ఊపిరి నిలిపానని
చిక్కని చెట్టు నీడకు తెలుసా
ఎందరి అలసటకి సేద దీర్చానని...
పూసే పువ్వు విరిసే తావి
పారే నీరు వీచే గాలి
తమ సహజ గుణాలే పాఠాలుగా
చెప్పకనే చెప్పే గురువులే!
అందరికీ అన్నీ అందించే
అమృతమయమైన మనసుతో
అలరించి చైతన్య పరచే
ఋతుకర్త ఎరుగనిదా ఈ నిజం?
హద్దు లేక మిడిసిపడే
బుద్ధి మతి కలిగిన మనిషి
ఒద్దిక ఓర్పు నేర్చే మనసులేక
గురివింద చందాన మిగిలిపోడా?
కొత్తగా వెలుగులు తెచ్చి
కొత్త రోజును వరమిచ్చి
కొత్త బ్రతుకును నేర్వమని
కొత్త అవకాశమిచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి