జీవితం సుఖదుఃఖాల మేళా :- మీనుగ సునీత -హిందీ ఉపాధ్యాయురాలు -ఒంగోలు, ప్రకాశం జిల్లా
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
=============
ఉన్న స్థితిలో మార్పురాని సమయాన 
వేదనను పంచుకోలేని పరిస్థితిలోన,
ఉన్నత స్థితికై పోరుసలిపే ప్రతి క్షణాన ,
ఆవేదన హృదయంలో కలిగినంతన ,
బరువు భారమై, భరించేదిగా భావింపబడు వేళ .

కన్నీటిని కళ్ళ లోనే మిగుల్చుకుని, 
కన్నీటితోనే తన దాహం తీర్చుకుని ,
కళ్ళులో ఆశలు కలల గూడుకట్టుకుని, 
కలల ఆశయాలకై కాళ్ళు పరుగెట్టుకుని,
బరువు భారాన్ని భరించు అదే వేళ.

కాదనలేని జీవన వాస్తవాలను కని, 
సాధించి తీరాలనే మది మాట విని,
మనసే మార్పునకు పెద్దదైన ఘని,
భూ భారం మోస్తున్నది కదా, అవని. 
మన బరువు భారం కాకూడదని మనవి.



కామెంట్‌లు