విభజించిన గోడలు నేలకొరుగుతున్నాయి.
కట్టుకున్న సమాధుల పునాదులు
కోట గోడలవుతున్నవీ.
నిండిన గుండెల నిండా అంతఃపురాలు
గాలిగోపురాళ్ళా మారుతున్నవీ.
దూరాన ధ్వజస్తంభం ధర్మగంట మారుమ్రోగుతుంది.
నర నరాన ప్రేమ స్వరం ఇంకినట్లు
కీర్తనల నిరాజనాలు రాలుతున్నయి.
మెరుస్తున్న శిఖరాగ్రాన కొనవుపిరితో పక్షి
శాంతి ప్రవచనాలు పలుకుతున్నది.!!
శిథిలాల గర్భగుడిలో రాతి దీపాలు వెలుగుతున్నవీ.
గతం గీతం రక్తపాతంలా పారుతునే ఉంది.
కరిగిన ప్రేమాభిమానాలు కోట్ల నక్షత్రాలై వెలుగుతున్నవి.
కూలిపోయిన కీర్తి మట్టి గర్భంలో
మకుటాలై తలెత్తుతున్నదీ
హృదయపూ గదులు -గంధపు వాసనలతో శ్వాసిస్తున్నాయి.!!
కౌగిట ఒదిగిన ముత్యాల మాటల సరిగమలు రాగాలై పలుకుతున్నాయి.
పూల పొత్తిళ్లలో త్రిమూర్తులు ఆత్మాలింగనం చేసుకుంటున్నారు.
అఖండ దీపం మౌనంగా ఆకాశాన్ని తాకింది.
గతపు సుగంధంతో పరిమళ పర్వతం నిదానంగా ఎదుగుతుంది.!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి