అది 1959. తన భార్యకు జరిగిన విషాదకరమైన ప్రమాదం తర్వాత దుఃఖంతో రగిలిపోయిన దశరథ్ మాంఝి అనే భారతీయ కార్మికుడు అసాధ్యమైన లక్ష్యాన్ని ప్రారంభించారు.
ఆయన భార్య ఫల్గుణీ దేవి వారి గ్రామం గెహ్లౌర్ సమీపంలోని పర్వత మార్గం నుండి పడిపోయింది. అయితే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించాలంటే 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక ఆమెను అక్కడి నుంచి తరలించడం అనేది క్లిష్టతరమైంది.
పొడవైన కష్టతరమైన మార్గం కారణంగా, ఆమెకు సకాలంలో వైద్య సహాయం లభించలేదు.
దీనిని దృష్టిలో పెట్టుకుని తమ గ్రామంలో మరెవరికీ ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనుకున్న మాంఝి తన మేకలను అమ్మి సుత్తి, ఉలి వంటివి కొనుగోలు చేసి పర్వతం మీద నుంచి గ్రామానికి ఓ రహదారి ఏర్పాటుకు పూనుకున్నారు.
1960 నుండి 1982 వరకు అంటే 22 సంవత్సరాలపాటు ఆయన పగలు, రాత్రి అని చూడక పర్వతమార్గానికి శ్రమించారు. ఇందుకోసం ఆయన పర్వతాన్ని చెక్కుతుంటే అందరూ పిచ్చోడంటూ హేళనగా నవ్వారు.
కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ ఆయన అనుకున్న మార్గం రూపుదిద్దుకోవడం ప్రారంభించినప్పుడు, వారి ఎగతాళి ప్రశంసగా మారింది. కొందరు అతనికి ఆహారం ఇవ్వడంతోపాటు అవసరమైన కొత్త పరికరాలు కొనివ్వ డంలో సహాయమందించారు.
ఒంటరిగా, అతను పర్వతం మధ్యలో 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతుతో ఒక రోడ్డును ఏర్పాటు చేశారు.
ఆయన ఈ అద్భుతమైన ప్రయత్నంతో గ్రామం నుండి సమీప పట్టణానికి గల 55 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి కేవలం 15 కిలోమీటర్లకు తగ్గించింది. అంతేకాదు, ఎటువెళ్ళాలన్నా వేలాది మందికి ఎంతగానో తోడ్పడింది.
సమాజానికి ఆయన కృషి ఓ అద్భుతమైన బహుమతి అయినప్పటికీ అధికారిక గుర్తింపు మాత్రం ఆలస్యమైంది. ఆయన 2007లో మరణించారు. అయితేనేం, ఆయన గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుని గుర్తు చేసుకుంటున్న అభిమానులెందరో ఉన్నారు. అంతేకాదు ఆయన జీవితగాథ ఒక సినిమాగా కూడా వచ్చింది. పోస్టల్ డిపార్టుమెంటు వారు ఓ తపాలా బిళ్ళను విడుదల చేశారు.
"దశరథ్ మాంఝీ మార్గం" నేడు ఒక వ్యక్తి సంపూర్ణ సంకల్పం, అంకితభావంతో ఏమి చేయగలడో అనే దానికి ఓ గొప్ప స్మారక చిహ్నంగా నిలిచింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి