ఇటీవల బదిలీల్లో కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి, బదిలీ కాబడిన కుదమ తిరుమలరావును, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సన్మానించారు. గతనెలలో జరిగిన బదిలీల్లో తిరుమలరావు, ఇదే జిల్లా జి.సిగడాం మండలంలో గల పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలకు బదిలీ అయ్యారు. తమ పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా రెండు సంవత్సరాలు పనిచేసి, పాఠశాల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించుటలో తనవంతు కృషి చేసారని సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమలరావు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలరావు రచనా శైలి అత్యద్భుతమైన రీతిలో ఉంటుందని, గానాలాపన వీనులవిందు, చిత్రలేఖనం కనులవిందు అని గొప్ప కళాకారునిగా ఖ్యాతి గాంచారని అన్నారు. బాలబాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసే బోధనా నైపుణ్యం విద్యాశాఖకు, ఉపాధ్యాయ వ్యవస్థకు వన్నె తెచ్చే రీతిలో ఉంటాయని ఆయన కొనియాడారు. తిరుమలరావును ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహోపాధ్యాయులు బొమ్మాళి వెంకటరమణ, పెయ్యల రాజశేఖరం, జక్కర వెంకటరావు, పడాల సునీల్, ముదిల శంకరరావు, యెన్ని రామకృష్ణ, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, మాచర్ల గీత, మజ్జి శంకరరావు, వసంత రాజారావు, జి.నరేష్ రామ్ జీ, యందవ నరేంద్ర కుమార్, బోధనేతర సిబ్బంది సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు శాలువా, పుష్ప గుచ్చం, జ్ఞాపిక, కానుకలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని తిరుమలరావు సేవలను ప్రశంసించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి