కళాకోట:-డా.రామక కృష్ణమూర్తి- బోయినపల్లి,సికింద్రాబాద్
నవరసాలకు ఆలంబన తానై,
నటనకు వర్ణమాలయై,
భాషలకు పట్టం గట్టి,
యాసలకు ప్రాణం పోసి,
నాటకరంగాన నాందీ-ప్రస్తావన చేసి,
చలనచిత్రరంగాన చరితార్థమై మిగిలి,
రాజకీయరంగాన పొసగని తావై,
మానవతకు మారుపేరై,
కీర్తిశేషమే మిగుల్చుకొని,
తెలుగువారింట చెరగని పేరై,
సినీవినీలాకాశంలో శాశ్వతతారై,
పెట్టని శ్రీ కోటయై,
విలక్షణ వ్యక్తిత్వంతో,
విశాలమైన దృక్పథంతో,
అలసి సొలసిన కళాకారుడు
నటరాజ పాదాల మంజీరమై
చిరస్మరణీయుడయ్యాడు.

కామెంట్‌లు