నల్లటి మబ్బులు :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
నల్లటి మబ్బులు కప్పాయి 
గడ బెడ అవి ఉరిమాయి
తీగ మెరుపులా మెరిశాయి 
అది జడివానై కురిసింది !!

చెరువు కుంటలు నిండాయి 
వాగులు వంకలు పారాయి 
రైతులు కాలువలు తీశారు 
పొలము లోకి వదిలారు !! 

బరద పొలము దున్నారు 
కూలీలందరు వచ్చారు 
వరి నారు నేమో పీకారు 
పొలమంతటా నాటారు !! 

పచ్చగా పైరు ఎదిగింది 
కలుపు వారు తీశారు 
కంపోస్ట్ ఎరువు చల్లారు 
వరి చేను గొలుసు పెట్టింది !!

పంట కోతకు వచ్చింది 
వరి కోత మిషన్ వచ్చింది 
వరి చేను అంతా కోసింది 
వడ్లను రాసి పోసింది !!


కామెంట్‌లు