అద్భుతంగా బాలసభ


 నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం లోని zphs తాటికల్ లో పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడే  బాలసభ  అద్భుతంగా బాలలు నిర్వహించడం  గొప్ప విషయం.  20మంది బాలబాలికలు వేదిక మీద ఉండి నేను  (కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి) రాసిన     = *ఊగుతున్న ఉయ్యాల  పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రతి గేయాన్ని చక్కగా విశ్లేషణ చేశారు.  ఆ గేయాలను స్ఫూర్తి గా తీసుకోని పాఠశాల కు చెందిన సంజన అనే బాలిక సొంతంగా గేయాలు రాయడం  ఆశ్చర్యం అన్పించింది.  కార్యక్రమం నిర్వహించిన తీరు  చూస్తే కండ్ల సంబురం గా వుంది.  ప్రతి విద్యార్థి స్వేచ్ఛగా  తమ తమ అభిప్రాయాలను  వ్యక్తం చేసిన తీరు  మహోద్బుతం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి , ఘనంగా సన్మానించిన పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మరియు నకిరేకల్ ఎంఈఓ  శ్రీ మేకల నాగయ్య గారికి, బాలసభ సలహాదారు, కవి రచయిత  డాక్టర్ సాగర్ల సత్తయ్య గారికి, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి  హృదయపూర్వక ధన్యవాదాలు.🙏 బాల సభలో పాల్గొన్న  చిన్నారులందరికీ  హృదయపూర్వక అభినందనలు💐💐

కామెంట్‌లు