వేద వ్యాసుడు-కోలా సత్యనారాయణ - విశాఖపట్నం


 సాహితీ కవి కళా పీఠం
     సాహితీ కెరటాలు
==================           
చరితార్ధుడు వ్యాస మహర్షి!!
ప్రసిధ్ధి చెందె బాదరాయణుడుగా...
పేరొందె కృష్ణ ద్వైపాయనుడు గా...
పుట్టిన రోజునే జరుపు కుంటాము,
వ్యాస పూర్ణిమగా, గురు పున్నమిగా!
పరాశరుడు, మత్స్యగంధిల సంతానం...
పుట్టగానే దండ కుండలాలు చేపట్టే,
తలచకగనే వచ్చెదనని తల్లికి మాటిచ్చె.
పామరులకు సైతం సుబోధకంగా,
వేదాన్ని నాలుగుగా విభజించి రచించే.
కురు వంశ రక్షకుడు, మాతృ విధేయుడు.
రచించె అష్టాదశ పురాణాలు,
నిక్షిప్తం పరచె బ్రహ్మ సూత్రాలు.
భారతాన్ని రచించె బాసర లోనే!
అచటే వెలసె సరస్వతీ ఆలయం.
'వ్యాసపురి' పేరొందె దక్షిణ గంగగా!
గాంధారి శత సంతుకు మార్గ మీతడు...
బోధించె నీతి ధర్మరాజుకు ఆనాడు..
సప్త చిరంజీవుల్లో  తను ఒకడు!
జ్ఞాని, గురువు, రక్షకుడు...
అతడే వేదవ్యాసుడు, భగవానుడు!!

కామెంట్‌లు