న్యాయాలు-928
"ప్రాగల్య్భ హీనస్య నరస్య విద్యా శస్త్రం యథా కాపురుషస్య హస్తే" న్యాయము
****
ప్రాగల్య్భ అనగా ధైర్యంగా, నిస్సంకోచంగా మాట్లాడటం లేదా ప్రవర్తించడం, విశ్వాసము, గర్వము,చాతుర్యము. హీనస్య అనగా తక్కువైన, క్షీణించిన.నరస్య అనగా మనిషి యొక్క, వ్యక్తి యొక్క.విద్యా అనగా బోధన, నిర్థిష్ట నైపుణ్యాల ,అభ్యసనాల సమీకరణం.శస్త్రం అనగా ఆయుధం.యథా అనగా ఏవిధముగా నైతే.కాపురు అనగా కాయువాడు, రక్షకుడు. షస్య అనగా పంట. హస్తే అనగా త్వరగా, వేగంగా అనే అర్థాలు ఉన్నాయి.
బుద్ధి లేని వాని విద్య మూర్ఖుని చేతి కత్తి వంటిది అని అర్థము.అనగా గుణ హీనుడు తనకు వచ్చిన విద్యతో మూర్ఖుని చేతి కత్తి వలె ఏదైనా చేయడానికి సాహసిస్తాడనే అంతరార్థం ఇందులో యిమిడి ఉంది.
ఇక్కడ బుద్ధిలేని వాడు అంటే విలువలు లేని వాడు అని,ఒక రకంగా చెప్పాలంటే దుష్టుడు అనవచ్చు.. అలాంటి వాడికి వచ్చిన విద్య మంచి కంటే ఎక్కువ చెడుకే ఉపయోగపడుతుంది. అనగా వాడు దానిని చెడు పనులు చేయడానికే ఎక్కువగా ఉపయోగిస్తాడు. నేడు చూస్తూ ఉన్నాం.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ళ. వాళ్ళు నేర్చుకున్న సాంకేతిక విద్యతో ప్రజలను మోసం చేసి బ్యాంకు ఖాతా ఉన్న ధనాన్ని ఎంతో చాకచక్యంగా దోచేస్తున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి పంపుతామని బెదిరిస్తున్నారు.ఇలాంటి వారు ఈ విధంగా అనేక అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.
బుద్ధి లేని వాని విద్య లేదా దుష్టుని విద్యకు సంబంధించిన విషయం గురించి సంస్కృత శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం.
"విద్యా వివాదాయ, ధనం మదాయ,శక్తిఃపరేషాం పీడనాయ!/ఖలస్య సాధో ర్విపరీత మేతజ్జనాయ దానాయ చ రక్షణాయ!!/
అనగా విద్యని వివాదానికి, ధనాన్ని గొప్పలకు దుష్టత్వానికి, శక్తిని బుద్ధిలేని వాడు లేదా ఖలుడు ఉపయోగిస్తాడని అర్థము.
ఇక సాధువులు అనగా సజ్జనులు. వీరు తమ ధనాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు దానాలు చేస్తూ, వారి రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు.
దుష్టుడేమో తనకున్న చదువు, విజ్ఞానాన్ని,వాటి వలన వలన సంఘంలో ఏర్పడిన పేరును , పలుకుబడిని,తన స్వార్థ ప్రయోజనాలకై, ఇతరులను పీడించడానికి ఉపయోగిస్తాడు. ఇలాంటి వాడికి ధైర్యమూ ఎక్కువే,సాహసమూ ఎక్కువే.
అందుకే మానవీయ విలువలు లేని బుద్ధి హీనుడి విద్య మూర్ఖుని చేతి కత్తిలాంటిదని మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి "ప్రాగల్భ్య హీనస్య నరస్య విద్యా శస్త్రం యథా కాపురుషస్య హస్తే" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే బుద్ధి హీనుడు తాను నేర్చుకున్న విద్యను దుష్టత్వానికి తప్ప, సమాజ సేవకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించడు. కేవలం అతడి స్వలాభం కొరకు, ఇతరులకు హాని చేయడం కొరకు మాత్రమే ఉపయోగిస్తాడనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా అలాంటి వాడి ఆగడాలను అరికట్టడానికి చేయి చేయి కలిపి ఐక్యతతో అతనిని మార్చేందుకు ప్రయత్నం చేయాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి