న్యాయాలు-921
లోకో భిన్న రుచిః న్యాయము
*****
లోకో అనగా ప్రపంచంలో, లోకంలో. భిన్న అనగా వేరుగా ఉన్నది, వేరైన. రుచి అనగా అనుభూతి,ఇష్టము, ఇంద్రియ జ్ఞానము అనే అర్థాలు ఉన్నాయి.
లోకములో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అని అర్థము.
ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో రుచి లేదా ఇష్టం ఉంటుంది. రుచి అంటే ఏమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.
రుచి అనే పదానికి సందర్భాన్ని బట్టి అర్థము మారుతుంది. భోజన సమయంలో రుచి అంటే జిహ్వకు సంబంధించిన ఇంద్రియ జ్ఞానముగా చెప్పుకోవచ్చు.నాలుక మీద రుచి మొగ్గలు ఉంటాయని, వాటి ద్వారానే మనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు,వగరు లాంటి రుచులను గ్రహించి చెప్పగలము.
రెండవది అనుభవ పూర్వకమైన రుచి లేదా ఇష్టం.దీనిని బట్టి ఏదైనా నిత్యం తీసుకుని దానిని ఇష్టపడటంతో దాని రుచిని మనసులో నిలుపుకొని వదలకుండా దానిని వ్యసనంగా మార్చుకోవడం.అదే కాఫీ, టీ, మద్యపానం లాంటివి ఒక్కసారి వాటి రుచికి బానిస అయ్యారా ? అవి ఆయా వ్యక్తులను బానిసగా చేసుకుని తాగకుండా ఉండలేని పరిస్థితికి తీసుకుని వస్తాయి.
ఇక కళాత్మక రుచి. ఇందులో కళలు మిళితమై ఉంటాయి. అవి సంగీత, సాంస్కృతిక, సౌందర్య, సాహిత్య,కళాభి రుచులు అన్నమాట. కొంతమందికి సంగీతంలో రుచి దొరికి దానిని జీవితాంతం వదలకుండా అందులో ఆనందాన్ని పొందుతారు. మరికొందరు సాహిత్యాభిరుచి చదవడం లేదా రాయడం అందులో రుచిని నిరంతరం ఆస్వాదిస్తూ ఉంటారు.
సౌందర్యాభిరుచి కలిగిన వారు ప్రతి పువ్వు,నవ్వు,అందం,అని ఆనందంలో రుచిని పొందుతూ వాటిని చూడటానికి , అనుభూతించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇలా రకరకాల కళల పట్ల రుచిని పెంచుకుని వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు.
ఈ విధంగా ఒక్కొక్కరు వ్యక్తిగతమైన రుచులతో మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అందరి రుచులు ఒకేలా ఉండవు. ఇది ఆహార అలవాట్ల విషయంలో మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తీపి,కారం, పాలు పెరుగు లాంటి వాటి పట్ల ఇంట్లో వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కో రుచి వుంటుంది. ఇలా ఇష్టాయిష్టాలు వేరువేరుగా ఉంటాయి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఓ పద్యమే రాశారు.అదేంటో చూద్దామా!
" ఒకనికి రుచించునది హేయమొకనికగును/ భిన్న పూరుషులకు గల్గు భిన్న రుచులు/ సర్వజన మాననీయమై సరసమైన/ కమ్మ సంపంగి ఆళికి సహ్యమ్ము గాదు"
అనగా ఈ రుచుల గురించి చిలకమర్తి గారు ఇలా ప్రస్తావిస్తూ మనం ఏ విధంగా ప్రవర్తించినా అందరినీ మెప్పించలేమనే సత్యాన్ని ఈ పద్యంలో వివరించారు. ఒక మనిషికి రుచించినది ఇంకొకరికి రుచించదు.ఇంకా చెప్పాలంటే అసహ్యించుకుంటారు కూడా.జగమెరిగిన సత్యం ఇది. ఎంతో పరిమళ భరితమైన, ఇంపైన వాసనలను వెదజల్లుతూ అందరినీ ఆకర్షించే సంపెంగ వద్దకు తుమ్మెద చేరదట.సంపెంగ పుష్పాల మకరందాన్ని గ్రోలదట. ఎందువల్లో. చదువుతుంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా!
అంటే కేవలం మనుషులకే కాదు తుమ్మెద లాంటి కీటకాలకు కూడా ఇష్టాయిష్టాలు వేరువేరుగా ఉంటాయనేది మనం ఈ పద్యం ద్వారా గ్రహించగలిగాం. ఇలా ఎవరెవరి ఇష్టాలు ఎలా వుంటాయో గ్రహించి వారికి ఇష్టమైనట్లు మనం మసలుకోవాలంటే కొంత కష్టమే కానీ ఓ మంచి కార్యం నెరవేరాలంటే తప్పదు మరి.
అందుకే లోకో భిన్న రుచి అనే ఆర్యోక్తి లేదా న్యాయమును " జహ్వకో రుచి-పుఱ్ఱెకొక బుద్ధి అని కూడా అనవచ్చు.
ఇందుకు ఓ ఉదాహరణ సునంద భాష్యం✍️

ఇందుకు ఓ ఉదాహరణ కేవలం కుటుంబమే కాదు. ఒకే తల్లి పిల్లలు కూడా. వాళ్ళలో మానసిక, శారీరక వ్యత్యాసాలు మాత్రమే కాకుండా ఇష్టాయిష్టాలు, ప్రవర్తనలు వేరు వేరుగా ఉండటం మనందరికీ తెలిసిందే. ఇలా కుటుంబం, సమాజం, లోకంలోని ప్రజలంతా విభిన్న స్వభావాలు,రుచులు కలిగి వున్నారు.
ఎన్ని విధాలుగా భిన్నంగా ఉన్నా మంచితనం, మానవీయ విలువలకు కట్టుబడి ఉంటే దుష్టత్వం, దుర్మార్గం లేని లోకం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. అందుకోసం మనమంతా కలిసి బాల్యం నుంచే మంచి స్వభావం, మంచి అభిరుచులు కలిగే విధంగా పెంచేందుకు ప్రయత్నం చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని, మానవతా విలువల ఏక రుచిలోని మాధుర్యాన్ని గ్రోలే విధంగా చూద్దాం.
వురిమళ్ల సునంద, ఖమ్మంకేవలం కుటుంబమే కాదు. ఒకే తల్లి పిల్లలు కూడా. వాళ్ళలో మానసిక, శారీరక వ్యత్యాసాలు మాత్రమే కాకుండా ఇష్టాయిష్టాలు, ప్రవర్తనలు వేరు వేరుగా ఉండటం మనందరికీ తెలిసిందే. ఇలా కుటుంబం, సమాజం, లోకంలోని ప్రజలంతా విభిన్న స్వభావాలు,రుచులు కలిగి వున్నారు.
ఎన్ని విధాలుగా భిన్నంగా ఉన్నా మంచితనం, మానవీయ విలువలకు కట్టుబడి ఉంటే దుష్టత్వం, దుర్మార్గం లేని లోకం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. అందుకోసం మనమంతా కలిసి బాల్యం నుంచే మంచి స్వభావం, మంచి అభిరుచులు కలిగే విధంగా పెంచేందుకు ప్రయత్నం చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని, మానవతా విలువల ఏక రుచిలోని మాధుర్యాన్ని గ్రోలే విధంగా చూద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి