ఆయన కేరళకు చెందిన గణిత ఉపాధ్యాయుడు. పేరు అబ్దుల్ మాలిక్. ఈయన 20 సంవత్సరాలకు పైగా, తన పాఠశాలకు నిర్ణీత సమయానికి చేరుకోవడానికి ప్రతి రోజూ ఒక నదిని ఈదుకుంటూ పోయేవారు. ఈ క్రమంలో ఆయన ఎన్నడూ అనారోగ్య బారిన పడలేదు. ఆలస్యంగా వెళ్ళేవారు కాదు. ఎన్నడూ నిబద్ధత తప్పలేదు.
రద్దీగా ఉండే బస్సులో ఏంటీ అవస్థ అని 3 గంటలకు పైగా ప్రయాణించడానికి బదులుగా, ఆయన కదలుండిపుళ నదిలో 15 నిమిషాల పాటు ఈదుకుంటూ వెళ్ళిపోవడాన్నే హాయిగా ఉందనుకున్నారు. ఆయన అదనంగా ఓ జత బట్టలు, టిఫిన్ బాక్స్ ఊ ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టుకునేవారు. ఈదుతున్నంతసేపూ ఓ టైర్ ట్యూబ్ నడుమున ఉండేది. ఈ విషయం తెలిసి విద్యార్థులు, ఇతరులు ఆయనను "ట్యూబ్ మాస్టర్" అని పిలిచే వారు. అయినా ఆయనేమీ సీరియస్ గా తీసుకోలేదు.
ఆయన కేవలం లెక్కల పాఠాలు చెప్పడం వరకే కాకుండా క్రమశిక్షణ, ఈత కొట్టడం లోని మేలు, పర్యావరణ అవగాహన వంటివి కూడా నేర్పించేవారు.
చేసే పని పట్ల అభిరుచి, మంచి ఉద్దేశ్యం ఉన్నప్పుడు, ఏ అడ్డంకి కూడా పెద్దది కాదని చెప్పడానికి ఈ లెక్కల మాస్టారు ఓ గొప్ప ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి