బ్రాహ్మణ మహిళ:- సత్యవాణి

 సనాతన సాంప్రదాయానికి నెలవు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మ
ఆచర వ్యవహారాలకు
ఆలవాలం
బ్రాహ్మణ మహిళ కాకులు కూయకముందే మేల్కొందంటే
రాత్రి తొలిఝాము గడిచేవరకూ ఊపరాడని పనే పనేపని
ముంగలి ఊడ్చి
కల్లాపిజల్లి ముగ్గు పిండితో ముత్యాలముగ్గులతో
ముంగిలి తీర్చిదిద్ది
తులసికోట కడిగి
వరిపిండీ పసుపు కుంకుమలతో పద్మాలనుకోటముందు తీర్చిదిద్దిన అనంతరం
ముత్యమంత పసుపు ముఖాన పూసుకొని 
తలస్నానమాచరించి
కాశపోసి బిగించి చీరకట్టి రూపాయంత కుంకుమబొట్టు నెన్నుదుటను  సూర్యబింబాన్ని పోలిదిద్దుకొని
బ్రాహ్మణ మహిళ
పొయ్యి వెలిగించిందంటే
నవకాయ పిడవంటలతో దేవునికి ఆహారం సమర్పించి
ఆపై అపరాహ్నం అథిది దేవుళ్ళతో సహా
అందరి ఆరగింపులైనతరువాత 
మిగిలిందేదో తానింత తిని
తనపనిలో సహాయకులకింత పంచి పుణ్యమార్జిస్తుందా పునీత
వృధ్ధ అత్తమామలకు
తాను సేవలర్పించడమేకాదు
పెద్దలకు సేవచేసే విధానం నేర్పిస్తుంది తన బిడ్డలకు
బ్రాహ్మణ మహిళ
భార్యగా తాను తన భర్తను గౌరవించి
తన బిడ్డలకు తండ్రిని
గౌరవించే విధానం నేర్పుతుంది
ఇంటికి వచ్చిన బంధువులను
తాను గౌరవించి
తన సంతుకు బంధువుల యెడ ఎలామెలగాలో నేర్పుతుంది
బ్రాహ్మణ మహిళ
ఆ కుటుంబంలోని బాలలకు
ఒక గురువు
ఒక దైవం
ఒక ప్రవక్త
బ్రాహ్మణ మహిళల వల్లనే
సనాతన సాంప్రదాయం
భరతభూమిలో
ప్రవర్థమానంగా వెలుగొందుతోంది
నాటికీ ఏనాటికీ బ్రహ్మణ మహిళలవల్లనే
సనతన ధర్మం
నిత్యనూతనమై
విలసిల్లుతుంది
కామెంట్‌లు