సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=====================
బాలలం...పసి బాలలం!
తెలిసీ తెలియని మనసులం.
తప్పులు, ఒప్పులు తెలీవు...
ఆడుతు పాడుతు పడిపోతాం!
దెబ్బలు తగిలినా చూసుకోం!
మా మనసెంతో సున్నితం...
కసిరితే ఏడుపు లంకిస్తాం!
కొడితే కన్నీరు కార్చేస్తాం!
గిన్నెలు, బొమ్మలు విసిరేస్తాం..
ఆకలి కసలే ఆగలేం...
ఇల్లు పీకి పందిరేసేస్తాం.
నిద్రెపుడొచ్చునో తెలీదు..
ఎక్కడ పడితే అక్కడే..
నిద్ర పోతూ పడి ఉంటాం.
దుస్తులు మురికి చేసేస్తాం...
కాళ్ళూ చేతులు మట్టితో...
జుట్టంతా పీచు పీచు గా...
ముక్కులో చీమిడి కరుస్తాం!!
మా జోలికి అసలు రాకండి.
కోపం వేస్తే ఏం చెస్తామో!
మాకే అసలు తెలీదండి!
మేమే పెద్ద బుడుగులం!
అల్లరి చేసే పిల్ల పిడుగులం!!
బుడుగు: - కోలా సత్యనారాయణ - విశాఖపట్నం
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి