సాహితి కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
===========
అల్లరి ఆరి మా బుడుగు
బుడిబుడి అడుగులతో పరుగు
ముద్దు మాటలతో మాట్లాడేసే పొన్నారి
బొమ్మలతో ఆటలే అల్లరి
పుస్తకాల నిండా గీతల బొమ్మలు
అన్ని రంగులతో వేసేస్తాడు హరివిల్లులు
ఇసుకతో కట్టేసే బుడిబుడి గుడులు
మట్టితో చేసే వినాయకుని కుడుములు
పలక బలపం పట్టుకొని
అన్న చేయి ని గట్టిగా లాక్కొని
బడికి వెళ్తానని ఏడుపులంకించుకొని
త్వరగా బడికి వెళ్ళాడు
అమ్మ అన్నం పెడితే వద్దంటాడు
అమ్మ మురిపాలు పాలు కావాలంటాడు
అమ్మ
కోప్పడితే బుంగమూతి
అమ్మ లాలించితే ఆనంద అనుభూతి
అమ్మానాన్న ఇష్టమంటూ చిలక పలుకులు
పెద్దయితే నాన్నల అవుతానంటూ ఆరింద మాటలు
ఏమి చేసినా మనోహరమే మా కళ్ళకు
ఏమి మాట్లాడినా అమృతమే మా చెవులకు
అదే చిన్నారుల మహత్యం
మహత్యం:- : డాక్టర్ ఉప్పు జయ భారతి -నెల్లూరు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి