సాహిత్యం మనిషికి విజ్ఞానం అనే కన్ను వంటిది అని, పుస్తకం చదివితేనే తలరాత మారుతుందని రావూరి భరద్వాజ, ఎన్ గోపి, సినారెలు ప్రత్యక్షంగా చూపించారు అని ఎర్రోజు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
పుస్తక ఆవిష్కరణ మరియు కవి సమ్మేళనం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో జరిగింది. సభాధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెప్తే సగం ఇవ్వాలి బాల కథ పుస్తకము, శ్రీ శుభమస్తు మంగళ హారతుల సంకలనం ఆవిష్కరించారు.
మిట్టపల్లి పరశురాములు, సత్యలక్ష్మి గార్లు పుస్తకముల గురించి చక్కని సమీక్ష చేసారు. వర్కోలు లక్ష్మయ్య గారు పాటలు పాడుతూ సభను అలరించారు. మౌన స్వామి యోగా గురించి, గడ్డం బాలకిషన్ గారు సాహిత్య విలువలను తెలియజేశారు.
కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షుడు పెందోట వెంకటేశ్వర్లు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి