"సర్! నాకు మార్కులు నేను రాసిన దానికన్నా ఎక్కువ వేసినారు చూడండి." అన్నాడు వాసు. "మీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. నీకు మార్కులు తక్కువ వచ్చిన ప్రతీసారీ నిన్ను మీ పేరెంట్స్ ఎంత హింస పెడతారో నాకు తెలిసింది లేరా. నాకు సోము చెప్పాడు. అందుకే నీకు మార్కులు ఎక్కువ వేశా." అన్నాడు లెక్కల మాస్టర్. "సర్! నాకు తక్కువ మార్కులు వచ్చినందుకు తిట్టండి. కొట్టండి. ఇంటివద్ద నాకు శిక్ష విధించినా సరే!" నాకు నేను రాసిన దాన్ని బట్టి మార్కులు వేయండి ప్లీజ్!" అన్నాడు వాసు. ఈ ఒక్కసారికీ కుదరదు. నెక్స్ట్ టైం అయినా సబ్జెక్ట్ మీద ఏకాగ్రత పెట్టు. అలా చేయకపోతే నెక్స్ట్ టైం నువ్వు రాసిన దానికన్నా మరింత తక్కువ మార్కులు వేస్తాం అందరం టీచర్లం." అన్నాడు మాస్టర్. "సర్. ఈసారి నా మార్కులు సవరించి, నేను రాసిన దానికి తగ్గట్లు తక్కువ మార్కులు వేస్తే రేపటి నుంచే అన్ని సబ్జెక్టులలో కష్టపడి చదవడం మొదలు పెడతా. అలా చేయకపోతే మీ ఇష్టం వచ్చిన శిక్షలు విధించవచ్చు." అన్నాడు వాసు. ఆశ్చర్యపోయాడు ఉపాధ్యాయుడు. వాసును దగ్గరకు తీసుకుని, మెచ్చుకొని వాసు చెప్పినట్లు చేశారు మాస్టర్. జరిగిన సంఘటన రాము ద్వారా వాసు తల్లిదండ్రులకు తెలిసి, తన కొడుకు నిజాయితీకి మెచ్చుకున్నారు.
నిజాయతి : సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి