మెలికల లోయల్లో
మెరుపుల సందడి
వెచ్చగ చలి కాచుకునే
పచ్చని ప్రకృతి.
కనిపించని వెలుగుల నేస్తం
వినిపించే ఉదయరాగపు
తనియించే మేలుకొలుపులో
తరియించే ధరణి సమస్తం
వనసీమలో విహాంగమై
చరించే మౌన మానసం
వర్షించే కాంతి ధారల్లో
వరించే ఆనంద తరంగం!
పలకరించే పొగమంచును
పరవశింపచేసే వనసోయగం
ప్రసరించే వెలుగు రేఖల
ప్రకాశించే పచ్చని సౌందర్యం
అల గగనాన మేఘమాలలు
ఇలను దాచగ దిగిరాగా
ఇంపుగా ఇనుని రాకతో
ఇక తమ ఆశ తీరదని పరుగులు!
కలిసి వచ్చే కాలానికి
తెలుసు ఎపుడు ఏమివ్వాలో
మిడిసిపడే మనసుకు తెలుసా
పసిడి కలలు తీరేదెపుడని?
వెన్నెలంటి వేకువ వెలుగులకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి