వ్యాసుడు:- మీనుగ సునీత - ఒంగోలు
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
=============
ఆది గురువు అనదగినవాడు .  
సంస్కృతిని సంస్కరించినవాడు.
వేద, వేదాంగాలను సన్నుతించినవాడు.
సంప్రదాయములను గౌరవించెను వ్యాసుడు.   

విశాల దృక్పదమును మది నందుంచినాడు. 
విశ్వ శ్రేయస్సు కై అడుగేయగలిగినాడు. 
సనాతనతకు సర్వ శ్రేష్టతనిచ్చినాడు .
సత్ సంప్రదాయాల వ్యాప్తికి కృషి గావించినాడు.

వాంజ్ఞ్మయాన్ని విస్తరింప చేసి,
ధర్మానుష్ఠతను పదిలపరచి,
ధర్మ సంస్థాపనను సులభతరం చేసి, 
ధర్మం అనుయాయునిగా పేరుగాంచెను వ్యాసుడు.

అజ్ఞానాంధకారములను పారద్రోలు నట్టి,
జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేయునట్టి, 
తిమిరమున చల్లని వెన్నెలలు కురిపించు నట్టి,
వ్యాస మహర్షి మహా గురువై అవతరించెను.

గురు పౌర్ణమి శుభదినము అవతరించే, 
గురువు ఘనతను ఎల్లరూ గౌరవించే, 
గురు చరణారవిందములకు నమస్కరించే,
గురువు సంస్కార దీవెనలను శిష్యులకందించేను.



కామెంట్‌లు