పక్షుల నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు..!:- - యామిజాల జగదీశ్
 అవి రాత్రిపూట ఏమీ తినవు. అలాగే అవి ఆరోగ్యం బాగా లేనప్పుడూ ఏమీ తినవు.
అవి రాత్రిపూట ఎటూ తిరగవు. అవి కలిసి ఒక చోట ఉంటాయి.
అవి తమ పిల్లలకు సరైన సమయంలో ఒంటరిగా జీవించడానికి శిక్షణ ఇస్తాయి.
అవి అదేపనిగా తినవు. ఎంత ధాన్యం అందుబాటులో ఉన్నా, అవి తమకు అవసరమైన మేరకే  మాత్రమే తింటాయి
చీకటి పడగానే అవి నిద్రపోవడం ప్రారంభిస్తాయి. తెల్లవారుజామున సంతోషంగా పాడుతూ మేల్కొంటాయి.
అవి తమ ఆహారాన్ని మార్చుకోవు.
వాటి శరీరాలు బలంగా ఉన్నంత వరకు అవి పని చేస్తాయి. రాత్రిపూట తప్ప ఇతర సమయాల్లో అవి విశ్రాంతి తీసుకోవు.
చాలా పక్షులు జీవితాంతం లేదా జత కట్టిన దానితోనే  జీవిస్తాయి.
అవి తమ పిల్లలకు పూర్తి ప్రేమను ఇస్తాయి. వాటినీ అలాగే పెంచుతాయి.
మగ పక్షులు ఆడ పక్షులు గూళ్ళు నిర్మించడానికి, గుడ్లను రక్షించడానికి, 
అవి ఎప్పుడూ ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించవు. పైగా విత్తనాలను వ్యాప్తి చేయడం, వ్యర్థాలను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తాయి.
అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి  తమ కోసం అందమైన, సురక్షితమైన గూడును నిర్మించు కుంటాయి.
కాబట్టి మన దురాశ, అసూయ, కోపం, న్యూనత, వక్రబుద్ధి, సోమరితనం అన్నింటినీ విసిరివేసి, పక్షులలా జీవిత ఆకాశంలో సంతోషంగా ఎగురుదాం.


కామెంట్‌లు