సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=============
అందరి కోసం తను,అందరికీ తలలో నాలుకలా తాను..
కాలికి బలపాలు కట్టుకుని,ఇంటిల్లిపాదికీ అన్నీ అమర్చిపెట్టి..
తనకు మాత్రం ఏమీ మిగిల్చుకోక, అందరి మోములో ఆనందం..
తన ఆనందంగా,అదే తన ఆరోగ్యంగా భావించే ఓ మగువా నీకు వందనం..
సూరీడు కంటే ముందే మేల్కాంచి అందరికీ తానే అమర్చిపెట్టి..
రేయి అందరికంటే చివరన నిద్రించే ఆ త్యాగమూర్తి..
తన గురించి ఆలోచించుకోదు, తన ఆరోగ్యాన్ని పట్టించుకోదు..
ఎంత బాగాలేకున్నా,బాధలున్నా కనురెప్పల మాటున దాచుకుంటుందే తప్ప.
నాకు ఈ కష్టం అని నోరువిప్పదు,సరికదా..
అన్నిటికీ తానే జవాబుదారీగా,ఇంటికి ధ్వజస్తంభమై నిలుస్తుంది.
ఒక చేత్తో గరిట,మరోచేత్తో మసిగుడ్డతో గృహప్రవేశం చేసే ఇల్లాలు..
పగలంతా బొంగరంలా తిరుగుతూ, రాత్రి మగడి కన్నుల్లో కాంతులీనుతూ..
తెల్లారేసరికి మంకెన పువ్వులా విరిసి,తిరిగి తన వారికై తాను తపించిపోతూ..
ఒక్కసారిగా చతికిల పడిన వేళ,ఎవ్వరూ పట్టించుకోక.
ఆ బరువు భారమై పోయి భరించాలని అనుకున్న వేళ.
విసుక్కుంటూనే, ఎప్పుడెప్పుడు వదిలిపోతుందా అని గొణుక్కుంటుంటే.
భగవాన్!అంతా సవ్యంగా ఉంటేనే నేను ఇక్కడ...
అన్నీ మూలపడిన నాడు నీచెంతకు చేర్చుకో ప్రభూ అంటూ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి