సోమయ్య అనే అతనికి ఇద్దరు పిల్లలు ఉండేవారు. అబ్బాయి పేరు రంగ, అమ్మాయి పేరు అలివేలు. రంగ కంటే అలివేలు రెండు సంవత్సరాలు చిన్న. సోమయ్య కొడుకు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో కొడుకును మంచి పేరున్న ప్రైవేటు పాఠశాలో చేర్పించాడు. కూతురు అలివేలును చిన్న చదువులు చదివించి, ఆ తర్వాత పెళ్ళి చేసి అత్త గారి ఇంటికి పంపాలనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలో చేర్పించాడు.
అలివేలు చదువుతున్న పాఠశాలలో మంచి టీచర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచీ అలివేలు టీచర్లు చెబుతున్న పాఠాలను ఏకాగ్రతతో వింటూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. రంగ చదువుతున్న ప్పైవేట్ పాఠశాలలో అనుభవం తక్కువ ఉన్న ఉపాధ్యాయులు. బోధన అంతంత మాత్రమే. విద్యార్థులకు వారు చెప్పే పాఠాలు సరిగా అర్థం అయ్యేవి కావు. కానీ పిల్లలకు అర్థం కాకున్నా స్టడీ మెటీరియల్ ఇచ్చి, బాగా బట్టీ పట్టించేవారు. దాంతో రంగ చదువులో వెనుకబడి ఉండేవాడు. తల్లిదండ్రులు తమ అబ్బాయి బాగా చదువుతున్నాడు అనుకునే వారు. రంగ బిల్డప్ కూడా అంతే ఉంది.
రంగ 10వ తరగతి చాలా తక్కువ మార్కులతో పాస్ అయినాడు. ఇంటర్మీడియేటులో కొత్త స్నేహితుల సహవాసం వల్ల రంగ చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడు. అతని ప్రవర్తన కూడా గాడి తప్పింది. తల్లిదండ్రుల. కు కూడా ఎదురు చెబుతున్నాడు. రంగ బాగా చదివి మంచి ఉద్యోగం చేసి, తమను పోషిస్తాడన్న నమ్మకం పోయింది.
అలివేలు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భారీగా మార్కులు తెచ్చుకుని మండలంలో ఫస్ట్ వచ్చింది. తనను చదువు మాన్పించవద్దని, ఇంటర్మీడియట్ చదవాలని ఉందని తల్లిదండ్రులను బతిమాలింది. కూతురైనా తమను ఉద్దరిస్తుందని తల్లిదండ్రులు అలివేలును ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుమతి ఇచ్చారు. కూతురైనా మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చూడాలని తల్లిదండ్రుల కోరిక.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి