కర్ణుడు మరణానంతరం నరకానికి వెళ్ళాడు. అది తెలిసి అతని తండ్రి సూర్యుడు ఎంతగానో బాధపడ్డాడు. ఆగ్రహమూ చెందాడు.
అప్పుడు శివుడు సూర్యుడితో "నువ్వు బాధపడి లాభం లేదు....నీ కుమారుడిని యమదూతలు నరకానికి తీసుకుపోవడంలో ఎలాంటి తప్పూ లేదు" అన్నాడు.
"అదేంటీ, నా కొడుకు ఎంత పుణ్యవంతుడో మీకు తెలీదా?" అని అడిగాడు సూర్యుడు.
శివుడు "నువ్వలా అనుకుంటే ఎలా? కృష్ణుడు అడగటంతోనే కర్ణుడు తన పుణ్యాన్నంతా ఇచ్చేసాడు. దాంతో అప్పుడు అతని వద్ద మిగిలినదల్లా అతను చేసిన పాపాలే. దానిని బట్టి అతనికి నరకమే ప్రాప్తి స్థానం" అని చెప్పాడు.
శివుడి మాటలతో ఏకీభవించని సూర్యుడు "అదెలా...కృష్ణుడు అడగటంతోనే పుణ్యాలన్నింటినీ ఇచ్చాసాడుగా. ఇందువల్ల అతను మహా పుణ్యవంతుడు కదా అవాలి. కానీ మీరేమో అందుకు భిన్నంగా చెప్తున్నారు ఏంటీ?" అన్నాడు.
అంతట పరమేశ్వరుడు "నీ ప్రశ్నకు నా సమాధానం విను. అడిగితే ఇస్తే అది దానం అవుతుంది. అడక్కుండా ఇస్తే అది ధర్మం అవుతుంది. కర్ణుడు చేసిందంతా దానమే తప్ప ధర్మం కాదు. చేసిన దానాల వల్ల అతను పుణ్యవంతుడైన మాట వాస్తవమే. కానీ కృష్ణుడు అడగటంతోనే ముందు వెనుకలు ఆలోచించక తన పుణ్యాన్నంతా ఇవ్వడం గొప్పే. కాదనను. అది హర్షణీయమే. అయినా దానం దానమే. ధర్మం ధర్మమే. ధర్మమానికి ఉన్న గొప్పతనం వేరు. ధర్మో రక్షతి రక్షితః అని ఉత్తినే అన్నారా. ఆలోచించు" అని అనడంతో సూర్యుడు మౌనం వహించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి