కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు:- సరికొండ శ్రీనివాసరాజు

 రెండు చిన్నారి జింకల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. రెండూ కలుసుకుంటే అడవి అంతా కలియ తిరుగుతూ రోజూ గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకుంటాయి. వాటి స్నేహం అడవిలోని అన్ని జంతువులకూ ముచ్చట గొలిపేది. మరికొన్ని చిన్నారి జంతువులు ఈ చిన్ని జింకలతో స్నేహం చేసినాయి.
      ఒకరోజు ఆ చిన్నారి జింకలు మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక జిత్తులమారి నక్క ఎదురైంది. "నా చిన్నారులూ మీరు తోడబుట్టిన వారా?' అని అడిగింది. "కాదు. అయినా మేము అంతకంటే ఎక్కువ స్నేహంగా ఉంటాము." అని చెప్పాయి జింకలు. "మీ స్నేహం ముచ్చట గొలుపుతుంది. నాకూ మీతో స్నేహం చేయాలని ఉంది." అన్మది నక్క. "అలాగే." అన్నాయి చిన్నారి జింకలు. 
     నక్క వెళ్ళిపోయాక రామచిలుక ఆ జింకల వద్దకు చేరింది. "అమాయక జీవుల్లారా. ఆ నక్క జిత్తుమారిది. మిమ్మల్ని నమ్మించి, మిమ్మల్ని సింహం వద్ఢకు చేరుస్తుంది. అలా నమ్మించి జీవులను సింహానికి ఆహారంగా  ఇస్తే ఆ నక్కకూ కొంత మాంసం దక్కుతుంది." అన్నది చిలుక. 
     "కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. అని ఎప్పుడూ మా అమ్మ చెప్పేది. అందుకే పెద్దల మాట వినాలి." అన్నది ఒక చిన్నారి జింక. ఆ రెండూ నక్కకు దూరంగా ఉన్నాయి.

కామెంట్‌లు