కనపడని తెరల మాటున
కనిపించే కలల వాకిలి
కని పెంచిన కలల వాకిట
కథ మారే కమ్మని ముంగిలి
నాకై వంగిన నింగిని
నాలోనే దాచేస్తూ...
నాకపు జాడలు చూపిస్తూ
నా వెనకే నడచి రమ్మంటా!
మంచితనపు పరిమళం
పంచిపెడుతూ పయనించి
కొంచెమైనా సరే కరుణ కలిగి
ఎంచి మేలు చేసే మనసిమ్మంటా!
చిన్ని పువ్వుల నవ్వులన్నీ
ఎన్నెన్నో పోగు చేసి
అన్నిటిని అందరికీ ఇచ్చి
నన్ను నేను మార్చుకుంటా!
శిలలైన వేదనలన్నీ
కల లాగా మరచిపోయి
ఇల పైన ఇంపుగా బ్రతికే
నెలవేదో కనుగొంటా!
పొడిచే పొద్దుకు ఎదురు నిలిచి
తెరలు తొలగిన తెల్లని మదితో
పొరలు తెలియని పసిపాపల్లే
సౌరభాలు నింపే గుణమిమ్మని కోరుతూ
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి