సముద్ర గర్భ రోడ్డు సొరంగం నార్వే..!!:- - యామిజాల జగదీశ్
 ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రగర్భ రోడ్డు సొరంగం 46 బిలియన్ డాలర్లతో నార్వే ప్రభుత్వం నిర్మిస్తోంది.
ఇది 1,300 అడుగుల లోతులో నిర్మితమవుతున్న తొలి సముద్రగర్భ రోడ్డు సొరంగం. దీని విస్తీర్ణం పదహారు మైళ్ళు.
ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును "రోగ్‌ఫాస్ట్ టన్నెల్" అని అంటారు.
ఇది నార్వేలోని ప్రధాన తీరప్రాంత నగరాలను కలుపుతూ ప్రపంచంలోనే అతి పొడవైన, లోతైన సముద్రగర్భ రోడ్డు సొరంగ మార్గంగా చరిత్రపుటల కెక్కుతోంది.
ఇది కేవలం రవాణా ప్రాజెక్టు కాదు. ఇది సాంకేతికత, స్థిరత్వం, పర్యావరణంపై ఆకుపచ్చ అభివృద్ధి ఆలోచనలను కలిగిన సొరంగం మార్గం.
ఇలా సొరంగం మార్గంలో డ్రైవింగ్ చేయడం ఓ గొప్ప అనుభవమవుతుందని నార్వే ప్రభుత్వం భావిస్తోంది.
2033లో ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించాలని అనేది నార్వే ప్రభుత్వం ఆలోచన. ఇది రోగలాండ్ కౌంటీలోని రాండాబర్గ్ - బోక్న్ మునిసిపాలిటీలను కలుపుతుంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతంతో నార్వేలోని దక్షిణ - ఉత్తర ప్రాంతాల మధ్య రాకపోకలను గణనీయంగా సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

కామెంట్‌లు