తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ:- - యామిజాల జగదీశ్
 చరిత్రలో 1978 జూలై 25కు ఓ ప్రాధాన్యముంది. ఎందుకంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ, లూయిస్ బ్రౌన్, మాంచెస్టర్‌లోని ఓల్డ్‌హామ్ హాస్పిటల్‌లో జన్మించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ - ట్యూబ్ బేబీగా పెరిగి, 2004లో వివాహం చేసుకుని తల్లి అయింది!
 
టెస్ట్-ట్యూబ్ పద్ధతి అనేది సంతానోత్పత్తి లేని జంటలు తమ కణాలను టెస్ట్ ట్యూబ్‌లో కలిపి, ఆపై వాటిని స్త్రీ గర్భంలో అమర్చి పెరిగేలా చేసే పద్ధతి! ఈ ప్రక్రియ సృష్టికర్తలు బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్, అతని తోటి గైనకాలజిస్ట్ పాట్రిక్ స్టెప్టో, ప్రఖ్యాత పిండ శాస్త్రవేత్త జీన్ పర్డీ. రాబర్ట్ పద్ధతిని మొదట్లో విమర్శించినప్పటికీ, క్రమంగా అన్ని దేశాలు దీనిని అంగీకరించాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా సాధారణ మైపోయింది.


కామెంట్‌లు