(4000 కవితలు వ్రాసిన సందర్భంగా అభినందన మందార మాల)
================================================
ఓ కూకట్లపల్లి...కవివర్యా...
తెలుగు భాషా జ్యోతిని వెలిగించి...
తెలుగు భాషా వికాసానికి కృషి చేసి...
అక్షరాల నాలుగు వేల కవితల
ఆణిముత్యాలను మూటగట్టి...
ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొని...
కమ్మని కవితా గానాలతో అలరించి...
సాహితీమూర్తుల అమృతహస్తాలతో
సన్మానాలు సత్కారాలెన్నో పొందిన
ఓ కవి రాజా...జయహో జయహో...
.
ఓ కూకట్లపల్లి...కవివర్యా...
మీ ప్రతిభ వెన్నెల
దీపమల్లె వెలిగిపోయే...
సహస్ర కవి భూషణ్ బిరుదు
మీకు అందమైన ఆభరణమాయె...
మీ పేరు పత్రికల్లో మారుమ్రోగిపోయే...
మీ కవిత్వం ఒక గంగాప్రవాహమాయే...
ఓ కూకట్లపల్లి...కవివర్యా...
మీ కలం సృష్టించింది ఓ సంచలనం...
మీ కవితల్లో దొరుకుతుంది
ప్రతి సమస్యకు ఓ పరిష్కారం...
ప్రతి ప్రశ్నకు ఓ జవాబు
మీరు కవితల్లో గోల్కొండ నవాబు...
ఓ కూకట్లపల్లి...కవివర్యా...
మీరు మానవ సంబంధాలు...
సమకాలీన సామాజిక అంశాలే
ఇతివృత్తంగా నాలుగువేల కవితలు
లిఖించుట చిత్రం కవితలన్నీ ప్రత్రికల్లో
ప్రచురితం కావడం...భళారే విచిత్రం.
ఓ కూకట్లపల్లి...కవివర్యా...
ఓ నా ఆత్మీయ సాహితీ మిత్రమా...
వేల కవితల వ్రాసిన ఓనెల రాజా
నీవు నిత్య సన్మాన శోభితుడవై
నిండూనూరేళ్ళు వర్ధిల్లుమయ్యా....
జయహో జయహో..!
ఓ కూకట్లపల్లి...కవిరాజా జయహో..!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి