సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు================అదిగదిగో!వచ్చె వచ్చె బుడుగు..అతడతడే! ఓ చిచ్చర పిడుగు...కొంటె,చిక్కు ప్రశ్నలెన్నో అడుగు..పిల్లల్లోకెల్లా వీడత్యంత పొడుగు..గోల గోల చేసే,బుల్లి బుడతడు...ముద్దు ముద్దుగా ముచ్చట్లాడుతాడు..గిచ్చి గిచ్చి,గుచ్చి గుచ్చి చూస్తాడు..చిలిపితనంతో చిందులే వేస్తాడు....ఇల్లు పీకి పందిరేసి మారుస్తాడు....అల్లరల్లరి పనులెన్నో చేస్తాడు....వడిగా ఉరికి బోర్లా పడతాడు....చాడీలే చెప్పి తంటాలు పెడతాడు..జుట్టు జుట్టు ముడేసి తప్పుకుంటాడు..తగువులు పెట్టి తమాషా చూస్తాడు..ఇంటి పరువు మంట కలుపుతాడు..బుడుగులా ఉండడం,తప్పు కదరా!బుద్ధిగా ఉండి,చదువుకోవాలిరా!అమ్మానాన్న పేరు నిలబెట్టాలిరా!భారతమాతకు, సేవ చేయాలిరా!గొప్ప కీర్తి,ప్రతిష్టలు పొందాలిరా!
కీర్తి,ప్రతిష్టలు పొందాలిరా!:- కాటేగారు పాండురంగ విఠల్,హైదరాబాద్
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి