పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. సాహిత్యం, సమాజహితం, నిరంతర ప్రవాహం అనే కవన దృక్పథం లక్ష్యాలతో పనిచేస్తున్న విమల సాహితీ సమితి నిర్వహించిన జాతీయ స్థాయి సమితి పోటీలకు తిరుమలరావు తన రచనను పంపి విజేతగా నిలిచారు. నేతలు దాతలు చేతలు రాతలు అనే పదాలను ఉపయోగించి పంపవలసిన పదాల పదనిసల పోటీలకు తిరుమలరావు పంపిన కవిత టాప్ ఫైవ్ లో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో తిరుమలరావు పాల్గొని బహుమతి సాధించారు. నేతలు చెప్పేది వాగ్దానం- అమలు చేసిన అది ప్రభంజనం, దాతలు చేసేది దానం- ఆదుకుంటే అది ఎంతగానో ప్రయోజనం, చేతలు చెబుతాయి నిదానం- అది మాటలకందని సేవాధనం, రాతలు భావాల సంచలనం- అది తలరాతలు మార్చగల అనుసంధానం అంటూ తిరుమలరావు రచించారు. అదేవిధంగా నోరు పోరు హోరు జోరు అనే పదాలను ఉపయోగించి నోరు మాట్లాడేదే నీ మనసు చెప్పే మాట, పోరు చెద పురుగు సుమా వద్దొద్దు పోట్లాట, హోరు గా ప్రశంసల వెల్లువ కురిపించు నీ తీరగు బాట, జోరు అన్నివేళలా పనికిరాదు ఆచి తూచి మోగించు జేగంట అంటూ రచించారు. విమల సాహితీ సమితి అధ్యక్షులు డా.జెల్ది విద్యాధర్, సమన్వయ కర్త తురుమెళ్ళ కల్యాణి, న్యాయనిర్ణేతలు డా.ఝాన్సీ ముడుంబై లు తిరుమలరావును అభినందిస్తూ బహుమతిని పంపారు. తిరుమలరావు పదాల పదనిసల పోటీ విజేతగా ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
పదాల పదనిసల విజేతగా తిరుమలరావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి