కొత్తూరు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి,
మెట్టూరు ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయని అమ్మల కామేశ్వరిని శ్రీశ్రీ కళావేదిక ఘనంగా సన్మానించింది.
ప్రపంచంలోనే ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన అతి పెద్ద సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ 150వ సదస్సులో అమె ఈ గౌరవం పొందారు.
36 సార్లు ప్రపంచ అవార్డుల్ని అందుకున్న ఏకైక సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక
విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం శుభం ఫంక్షన్ హాలులో జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్న కామేశ్వరి అందరి అభినందనలు పొందారు. ఈ 150వ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవులతో పాటు తెలంగాణా, ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన 150మంది కవులు ఎంపిక కాగా, కామేశ్వరి పంపిన కవిత ఎంపికైంది. కవి సమ్మేళనంలో అబలలపై అత్యాచారాలు అనే అంశంపై కామేశ్వరి స్వీయగీతాన్ని వేదికపై ఆలపించి అందరి అభినందనలను పొందారు.
శ్రీశ్రీ కళావేదిక విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కొరచిన రామ జగన్నాథ్, కార్యదర్శి సత్య కామ ఋషి, ముఖ్య సలహాదారులు కెవిఎస్ గౌరీపతి శాస్త్రి, మహిళాధ్యక్షురాలు కొల్లూరు స్వరాజ్యః రమణమ్మ, కోశాధికారి వై.సూర్యనారాయణరాజు, సహాయ కార్యదర్శి మరువాడ భానోజీలు సమన్వయం వహించగా ఆవృతాల వారీగా కవి సమ్మేళనం జరిగింది. అనంతరం అతిథులుగా విచ్చేసిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీభూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్ధసారధి, సోషల్ మీడియా ప్రతినిధి అమ్మూ బొమ్మిడి, విశ్వ భవిష్యత్ ప్రతినిధి బలివాడ రమేష్, ప్రముఖ వ్యాపారవేత్తలు అడుసుమిల్లి సురేష్ కుమార్, గాడేపల్లి ప్రభాకర శాస్త్రి, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆచార్యులు కందర్ప విశ్వనాథ్, ప్రముఖ వైద్యులు మోపిదేవి విజయ గోపాల్, రైల్వే యూనియన్ నేతలు పి.ఆర్.ఎం.రావు, తోట మౌళీశ్వరరావు, ఆర్.వి.ఎస్.ఎస్.రావు, జర్నలిస్ట్ సంఘ జాతీయకార్యదర్శి బి.శశి, శ్రీనాథుని వంశవారసులు కావూరి శ్రీనివాసశర్మ, అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి ధ్యాన్ చంద్ అవార్డీ ఉషా నాగిశెట్టి తదితరులు కామేశ్వరిని శాలువా, పూలమాల, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, పలు గ్రంథాలను బహూకరించి ఘనంగా సన్మానించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి