పల్లవి
దేవుడు ఇచ్చిన వరమే కాయం!
చక్కగ పెంచక పోతె అపాయం!
బుడిబుడి నడకల బుడతల ప్రాయం!
చుట్టుకు వచ్చెను స్థూలపు కాయం!
//దేవుడు ఇచ్చిన వరమే..//
చరణం:-(1)
ముద్దుగ పెద్దలు భీముడు అంటే..
పెద్దయ్యాకా ఉంటే తంటే..
గుద్దులు గుద్దిన దెబ్బల పంటే..
ఆయాసమ్ములు ఎప్పుడు వెంటే..
//దేవుడు ఇచ్చిన వరమే..//
చరణం:-(2)
కడుపున ఎప్పుడు ఆకలి బాధే!
కావలసినంత నోటికి రాదే!
వచ్చిన బరువే వెనుకకు పోదే!
స్థూలపు కాయము తరగని వ్యాధే!
//దేవుడు ఇచ్చిన వరమే..//
చరణం:-(3)
కుట్టిన బట్టలు ఒంటికి పట్టవు!
తెచ్చిన చెప్పులు పాదము మెట్టవు!
పెరిగిన క్రొవ్వుల బానెడు పొట్టవు!
ఊబకు పెరిగిన కొండవు!గుట్టవు!
//దేవుడు ఇచ్చిన వరమే..//
చరణం:-(4)
కండలు కరగగ ఎండకు పోరా!
దండిలు బస్కిలు దండిగ తీరా!
తిండిని మితముగ తిందువు లేరా!
భండన భీముని తమ్మునివేరా!
//దేవుడు ఇచ్చిన వరమే..//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి