లింగాలతో జంగమయ్య
నీ జానెడంత పొట్ట పైన
బారెడు పైడి జంజనం తో
మురెడు పొడుగు గడ్డంతో
నుదుటన విభూతి రేఖలతో
మెడలో రుద్రాక్ష మాలలతో
సంకకు జోల వేసుకుని
జంకు లేకుండొచ్చావయ్యా
చేతిలో జాలి చెంబు తో
ఒక్క చేత కమండలం తో
ఎక్కడెక్కడో తిరుగుతూ
ఇటొచ్చావు జంగమయ్యా
బిక్షాటన చేసుకుంటూ
గబ గబ నడుచుకుంటూ
లోకమంత తిరుగుకుంటూ
సదా జనం మేలు కోరుతావు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి