వ్యక్తిత్వవికాస నిపుణునికి నా అక్షర నివాళి:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం.
ఆత్మవిశ్వాసం దృఢసంకల్పంతో
అనుకున్న లక్ష్యాన్ని సాధించ వచ్చునని
మూఢనమ్మకాలు మనిషి ప్రగతికి నిరోధకాలని
తన ఇంద్రజాల విద్యతో నిరూపించి
వ్యక్తిత్వ వికాసనిపుణునిగా  ఆత్మనూన్యత, బలహీన మనస్సులకు ప్రేరణఇచ్చి
అనేక రచనలద్వారా సమాజశ్రేయస్సుకు పాటుపడి
పూర్వ ప్రజాముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి ప్రేరణతో
తన ప్రజ్ఞాపాటవలతో  మద్యపాన నిషేధం, ప్రభుత్వపథకాలు ప్రజలదరి చేర్చిన ప్రజాహితుడు.
భారత్  మ్యాజిక్ సర్కిల్
ప్రశాంతి కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా  ఎందరికో
మనోస్థైర్యం నింపిన
డాక్టర్ బి.వి.పట్టాభిరాం 
మీసేవలకు గుర్తింపుగా ఉమ్మడి రాష్ట్రప్రభుత్వాలనుంచి రెండు పర్యాయాలు కళారత్న పురస్కారాలు
పలు జాతీయ పురస్కారాలు అందుకోవడం
రెండు పి.హెచ్. డి లు తీసుకోవడం
అనేక ప్రతిష్టాత్మక సంస్థలు
వివిధ దేశాలలో  వర్క్ షాప్ ల నిర్వహించిన
మీ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించుటకై
భువిని వదలి దివికేగిన
మీకివే నా అక్షర నివాళి...!!
...........................
............................ 

కామెంట్‌లు