పారిపోయిన చిట్టి:- సిరికొండ నిక్షిత- ఆరవ తరగతి- జెడ్పిహెచ్ఎస్ తాటికల్- నల్గొండ జిల్లా
 అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు చిట్టి అనే పావురం, జంబో అనే ఏనుగు, స్వీటీ అనే కుందేలు ఉండేవి. అడవిలో ఒక సరస్సు పక్కనే చెట్టు కింద అవి నివసించేవి. ఒకరోజు అడవికి వేటగాడు వచ్చాడు. చెట్టు మీద ఉన్న చిట్టిని చూసాడు వేటగాడు. చంపాలని బాణం గురి పెట్టాడు. అది చూసిన జంబో, స్వీటీ చిట్టిని హెచ్చరించాయి. చిట్టి వెంటనే ఎగిరిపోయింది. జంబో స్వీటీ పారిపోయాయి. వేటగాడు నిరాశ చెంది అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు.

 నీతి ఐక్యమత్యమే మహాబలం

                
కామెంట్‌లు