స్ఫూర్తి: - పైడి రాజ్యలక్ష్మి

 ప్రకృతి నన్ను ఆలోచింప చేసింది ప్రకృతే స్ఫూర్తి అని,విశ్వమే ప్రేరణ అని నదుల ప్రవాహం నేర్పింది ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటి సాగాలని వృక్షం నేర్పింది ఎన్ని భాదలను ,దెబ్బలను తట్టుకొని అయినా పదిమందికి ఆశ్రయము ఇవ్వాలని ప్రతి చిగురుటాకు నేర్పింది మౌనంగా నే ఎదిగి చూపాలని ఆకాశం నేర్పింది ఎవరి తోడూ లేకుండా నీకు నీవే విస్తరించాలనే తపన ఉండాలని సూర్యోదయం నేర్పింది కటిక చీకటి లాంటి కష్టమొచ్చినా సంకల్ప సిద్ధి తో తిరిగి వెలుగును సాధించాలని ప్రతి నక్షత్రం నేర్పింది గాఢాంధకారములో నే మెరిసి చూపించాలని ప్రకృతిలో ప్రతి అణువు విశ్వములో ప్రతి కణము చెబుతున్నాయి నీలోనికి నీవు తొంగి చూడు నీవే ఓ విశ్వం,నీవే ఓ వృక్షం నీలోనే వెలుగునిచ్చే జ్ఞాన జ్యోతి ఉందని. కృషి ఉంటే జ్ఞానజ్యోతి అయిన పరమాత్మను పొందగలమని చెప్పే స్ఫూర్తి దాత ప్రకృతి మాత 
కామెంట్‌లు