ప్రకృతిలో
కోట్ల చెట్లు ఉన్నాయి.
అవి ఒకదాన్నొకటీ
తినడానికి పుట్టలేదు.
ఒకదాని నుంచి ఒకటి పుట్టాయి.
అవి అజాతశత్రువులు.
సరిగ్గా అలాగే
ప్రకృతిలో
కోట్ల జీవులు ఉన్నాయి
అవి ఒకదాన్నొకటి
తినడానికి పుట్టలేదు
ఒకదాని నుంచి ఒకటి పుట్టాయి.
కానీ
అవి ఒకదాన్నొఒకటి
తినడానికే పుట్టినట్టున్నాయి.!!;
అవీ అజాతశత్రువులే.!!
ఎక్కడో పొరపాటు జరిగింది
దాన్ని ప్రకృతి తిరిగి సరి చేసుకోలేక కాదు
అంతా సమయం లేక!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి