ఆ కుర్చి ఎవరిదమ్మా
కుదురుగా ఉండదు
ఎదురు నిలుస్తుంది
అదురు బెదురుండదు
దాని పై కూర్చున్న వారు
కదలకుండా ఉంటారు
కుర్చిని చూస్తే ఎందుకో
అందరికీ అంత ఇష్టము
అది కదలదు మెదలదు
దాని చెంతకు లాగేసుకుని
ముసి ముసిగా నవ్వుతూ
మిటమిట చూస్తుందది
మాయ చేస్తూ ఆ కుర్చీ
అందరిని దరి చేర్చుకుంటూ
ఎందరెందరినో మార్చేస్తుంది
అది ఎవరికి సొంతమో చెప్పండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి