అపర ధన్వంతరిలకు నా అక్షారాంజలులు:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం

 పగలనక రేయనక
ఎండనక వాననక
కులమత బేధాలు
వర్ణవివక్షతలను చూడక
అహర్నిశలు ప్రజారోగ్యం కొరకై
తమ సుఖ సంతోషాలను త్యాగం చేసి
ఎప్పుడు చిరునవ్వుతో  దేవతల వలే
మెడలో స్టతస్కోప్ ధవళ కోటుతో
ప్రాణంపోతుందని భయంకర వ్యాధులకు లోనైన వారిని కూడా
మేమున్నామని మీ ప్రాణపరిరక్షణయే మా బాధ్యత అన్న
'వైద్యో నారాయణో హరి'కి ప్రతీకలయిన
అపరధన్వంతరి ప్రతిరూపాలయిన
వైద్యులు భువిలో వెలసిన దైవ స్వరూపాలే
వారు ప్రాణప్రదాతలే
మీ సేవకు గుర్తింపుగా
జాతీయ వైద్య దినోత్సవం నాడు మీకివే నా అక్షరాంజలులు...!!
............................
.
........................
కామెంట్‌లు