. "వైకుంఠపాళీ లో సర్పాలు":- బెహరా నాగభూషణరావు
సాహితీ కెరటాలు.
 సాహితీ కవి కళా పీఠం .
=================
బతుకు  భారమై భరించే వేళ 
తప్పదు జీవనపోరాటం. 

కష్ట-సుఖాలు,
 కలిమి-లేములు,
 సుఖ-దుఃఖాలు ,
ఆనంద- విచారాలు,

ఆదర్శమూర్తి ఎదుర్కోలేదా 
 క్లేశం !
లోకమాత భరించలేదా భారం !

"జీవితం వడ్డించే విస్తరి"
 కాదెవరికి .
ఆటు-పోటు ల జీవితం ;
అదే విధాత లిఖితం.

ఫలం అందని కర్షకుడు,
కూలి కిట్టని శ్రామికుడు ,
ఉపాధి లేని నిరుద్యోగి,
 వలలో మోసపోయిన అబల ,
అన్యాయపు  టెత్తులలో-అసమర్ధుడు,
 కళ్ళల్లో -కష్టాన్ని దాచుకున్న గృహిణి ,
 గుండెల్లో -భారాన్ని దాచుకున్న యజమాని ,

జీవిత వైకుంఠపాళీలో,
 సర్పం -చే, మింగేవారెందరో !
అయినా;
 ఆత్మవిశ్వాసంతో ఆడే వారందరూ!

జీవితానుభవ-పాఠమే  ప్రబోధం .
తప్పదు ;ఏదైనా కడవరకు ప్రయాణం .

ఇది నా సొంత రచన .
 ఎవరి అనుసరణ,
 అనుకరణ  కాదు.


కామెంట్‌లు