విజ్ఞానం జీవిత గమ్యానికి సోపానం:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.
విజ్ఞానమంటే తెలుసుకోవడం
సనాతన ధర్మం లో
ఋషిప్రోక్తం విజ్ఞానమే
విజ్ఞానము గాకూడదు వినాశనం
ప్రజాహితం కావాలి 
సమాజ అభివృద్ధికి తోడ్పడాలి
మొన్న కరోనా సృష్టించిన కరాళ నృత్యం లో మన సనాతన వేద విజ్ఞానమే
ఎంతో తోడ్పడం గర్వకారణం.

పరమాణు బాంబు విస్ఫోటన శక్తిచే ధన ప్రాణ నష్టాలు అందరికి తెలినవే
ఆ శక్తిని విద్యుత్ శక్తి గా మార్చి పారిశ్రామిక అభివృద్ధి జరుగునన్నది అవగతమే.
పతంజలి యోగ శరీర దారుఢ్యాన్ని పెంచునని పాశ్చాత్య దేశస్తులు  అంగీకరించారు.

మహర్షి విశ్వామిత్ర సృష్టి గాయత్రీ మంత్రం శ్వాసనియంత్రణకు
 ఉపయోగపడి రక్త ప్రసరణ జరిగి ఆయుర్వృద్ధి జరుగునని 
 ఇప్పుడు ఇతరులు చెప్పినది మన ఋషులు ఏనాడో చెప్పారు
 కావున 'అతి సర్వత్ర వర్జయేత్ 'అని
సమాజాభివృద్దికి తోడ్పడే
పరిశోధనలు వినాశానికి గాక లోకకల్యాణం కి ఉపయోగిస్తే 
జీవిత గమ్యానికి సోపానమే అగును...!!
.............................


కామెంట్‌లు