\ఈ జీవిత రథచక్రంలో
వయసుడిగిన ప్రతివాడు...
ఏదో ఒకరోజు మరణిస్తాడు..!
కానీ...మనసు
విరిగినవాడు ప్రతివాడు...
ప్రతిరోజూ మదనపడుతూ...
మానసిక వ్యధతో రగిలిపోతూ...
క్రుంగిపోతూ.....కుమిలిపోతూ...
రోజు మరణిస్తూ…జీవిస్తూ ఉంటాడు..!
కారణం ఒక వీరునికి
వీరమరణం ఒకేసారి
ఒక పిరికిపందకు ప్రతనిత్యం
మృత్యువుతో పోరాటమే...
గుండె పగిలిన వాడు...
పగతో రగిలేవాడు…
ఏదో ఒక విషఘడియలో
క్షణికావేశంలో కత్తి దూస్తాడు...
కసితో కక్షతో రక్తం రుచిచూస్తాడు..!
అవమానాల కొరడా దెబ్బలకు
విలవిలలాడేవాడు విలపించేవాడు...
బతుకే భారమని...అది అంధకారమని...
వేయి దారులెతుకుతాడు ఆత్మహత్యకు.!
తరతరాలుగా
నిశ్శబ్దంగా వేధింపులకు
వ్యధలకు గురైనవాడు...
బాధలకు బలైనవాడు…
వేదనే ఒక వ్యసనమై…
అవమానమే ఒక అగ్నికణమై...
ఘాటుగా ప్రశ్నిస్తాడు...ప్రతిఘటిస్తాడు
ఎర్ర సూరీడై...ఎదురు తిరుగుతాడు..!
అప్పుడు
విజయమో వీరమరణమో...
ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు…
బొందితో ప్రాణం ఉన్నంత వరకు...
కడవరకూ...కన్ను మూసేవరకు...
ఓ యుద్ద సైనికుడిలా పోరాడుతాడు..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి