మంచి వ్యసనం : సరికొండ శ్రీనివాసరాజు
 లయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఇంటివద్ద ఎక్కువ సమయం చదువుకే కేటాయించేది. తీరిక సమయాలలో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం. తనతో సమయం గడిపేవారు లేరు. నాయనమ్మతో అయినా కథలు వింటూ కాలక్షేపం చేద్దాం అంటే నాయనమ్మ విసుక్కుంటుంది. లయకు ఏం చేయాలో పాలుపోక మొబైల్ ఫోనుకు బానిస అయింది.
    ఇటీవల శ్రుతి అనే క్లాస్ మేట్ తో స్నేహం ఏర్పడింది. శ్రుతి నాయనమ్మ ద్వారా లయ మంచి మంచి కథలు విన్నది. తరచూ శ్రుతి వాళ్ల ఇంటికి వెళ్ళడం, శ్రుతితో ఆడుకోవడం వాళ్ల నాయనమ్మ దగ్గర చేరి, కథలు వినడం లయకు అలవాటు అయింది. కథలంటే లయకు పిచ్చి అయింది. బాగా కథల పుస్తకాలు కొనడం, చదవడం అలవాటు చేసుకుంది. ఎవరైనా పుట్టిన రోజుకు లయను పిలిస్తే వాళ్లకు కథల పుస్తకాలు గిఫ్ట్ గా ఇవ్వడం హాబీగా చేసుకుంది. తన స్నేహితులను టీవీలు, మొబైల్ ఫోన్ల పిచ్చి నుంచి దూరం చేసి, నీతి కథల పఠనమే వ్యసనంగా చేయడానికి శతదా సహస్రదా ప్రయత్నించింది.
    వందల కొద్దీ కథలు చదవడం వల్ల, కొత్త ఆలోచనలతో తానూ కథలు రాయడం మొదలు పెట్టింది. శ్రుతిలయలు ఇద్దరూ ఒకప్పుడు కేవలం చదువులో పోటీ పడేవారు. ఇప్పుడు నీతికథలు రాయడంలో పోటీ పడుతున్నారు

కామెంట్‌లు