న్యాయాలు-919
"యతో ధర్మ స్తతో జయ" న్యాయము
*****
యతో అనగా ఎక్కడ నుండి,ఏ స్థలము నుండి.ధర్మ అనగా ధర్మము, విధి, నైతిక క్రమము న్యాయము.తథా అనగా అక్కడ, అప్పుడు.జయ అనగా జయము, విజయము అనే అర్థాలు ఉన్నాయి.
మరి ఈ శ్లోకాన్ని పూర్తిగా చూద్దామా
'ఉక్త వానాస్మి దుర్బుద్ధిం మందం దుర్యోధనం పురా!యతః కృష్ణ స్తతో ధర్మో యతో ధర్మస్తతో జయం"
అనగా ఎక్కడ ధర్మము ఉంటే అక్కడ జయము కలుగుతుంది అని అర్థము.
"ఈ యతో ధర్మస్తతో జయః ' అనేది మన అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నినాదం కూడా.
ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. దీనికి మనందరికీ తెలిసిన ఉదాహరణ మహా భారతంలోని పాండవులు. వారు మొదటి నుంచి చివరి వరకు ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల విజయం సాధించారని మహా భారతం నొక్కి చెప్పింది.
ఈ శ్లోకం మహా భారతంలో సుమారుగా 13సార్లు వస్తుంది.మనిషి నీతి నిజాయితీగా ఉంటే అక్కడ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అతడినే విజయం వరిస్తుంది అని అర్థము.
ఈ మహా భారతంలో ఎవరెవరి నోటి నుండి ఈ వాక్యము వచ్చిందో చూద్దాం.
1.ఒక చోట దృతరాష్ట్రుడు విదురునితో అంటాడు " ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని అందరికీ తెలిసిందే.మీరు చెప్పేదంతా జ్ఞానులతో ఆమోదించబడింది మరియు నా భవిష్యత్తుకు మేలు చేస్తుంది.కానీ నా కుమారుడు దుర్యోధనుని విడిచి పెట్టే ధైర్యం నాకు లేదు ఆని అంటాడు.
2.కర్ణుడు కూడా భీముడిని దృష్టిలో పెట్టుకొని శ్రీ కృష్ణుడితో "హృషికేశా! ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని నాకు తెలుసు" అంటాడు.
3.అదే విధంగా ద్రోణుని నుండి దుర్యోధనుడు;4. వేదవ్యాసుని నుంచి దృతరాష్ట్రుడు:5. అర్జునుని నుండి యుధిష్ఠిరుడు; 6.సంజయుడి నుంచి దృతరాష్ట్రుడు,7.భీష్ముడు నుండి దుర్యోధనుడు;8.భీష్ముడు నుండి కర్ణుడు;9.వేదవ్యాసుని నుండి యుధిష్ఠిరుడు ఈ మాటలు వింటాడు -"ఓ యుధిష్ఠిరా! ఎల్లప్పుడూ అహింస, దాతృత్వం, క్షమాపణ మరియు సత్యాన్ని అత్యంత ఆనందంతో ఆచరించాలి.ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని చెప్పి వెళతాడు.
10.కృష్ణుడి నుండి గాంధారి;11.వేదవ్యాసుని నుండి గాంధారి;12. గాంధారి నుండి కృష్ణుడు;13.భీష్ముడు కృష్ణుడితో "నేను ఈ మాటలను దుర్మార్గుడు మరియు దుష్ట బుద్ధి గల దుర్యోధనుని ఉద్దేశించి చెప్పాను.కృష్ణుడు ఎక్కడ నివసిస్తాడో, అక్కడ ధర్మం ఉంటుంది.ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది- ఈ విధంగా మహా భారతంలో 13 సందర్భాల్లో 13 సార్లు ధర్మం -విజయం గురించి చెప్పడం జరిగింది.
ఇదంతా ధర్మ సంస్థాపన చేయడం కోసమే. పాండవులు జూదం ఆడి అన్నీ కోల్పోయారు.13 సంవత్సరాలు అరణ్య వాసం చేశారు. కౌరవులు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి ధర్మ యుద్ధం చేసి విజయం సాధించారు.
నీతి నిజాయితీ కలిగి ధర్మాన్ని అనుసరించి నట్లయితే తప్పకుండా విజయం కలుగుతుందనేది ఈ న్యాయము లోని అంతరార్థము.కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ న్యాయమును గమనంలో ఉంచుకోవాలి, నీతి, నిజాయితీతో నియమాలను పాటిస్తూ సత్యసంధత కలిగి జీవించాలి. అప్పుడు మనమూ పాండవుల వలె విజయాన్ని పొందుతాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి