ఎగిసిపడే కలల రంగు
మిడిసిపడే మనసు రంగు
తుళ్లిపడే కోర్కెల రంగు
తెల్లారే వేళ అలముకునే నారింజ
ఎదురుచూపుకు ముగింపు
కుదురు మనసుకు తెగింపు
బెదురు కలతలకు చిత్తగింపు
ముదురు బలానికి కొనసాగింపు...
కొత్త మొదలుకు శ్రీకారంగా
చిత్తానికి ధైర్యమిచ్చే ఓంకారంగా
నెత్తావులు పంచే మమకారంగా
మొత్తం మంచిగా స్వీకారం
తరుముకొచ్చే విజయపు తలపు
తెరుచుకునే అదృష్టపు తలుపు
కోరుకున్న చక్కని మలుపు
చేరుకోవాల్సిన తీరపు పిలుపు
ఏమెరుగని మనసుకు నచ్చేలా
తెలియని వరముల మూట తెచ్చేలా
అందని మిన్నులు అందుకునేలా
అందరినీ అలరించే అందమైన వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి