నూతనావిష్కరణ:- - యామిజాల జగదీశ్
 భారతదేశంలోని కేరళకు చెందిన యువ ఆవిష్కర్త రెమ్య జోస్. కేవలం 14 సంవత్సరాల వయసులో, విద్యుత్ లేకుండా పనిచేసే పెడల్-శక్తితో పని చేసే వాషింగ్ మెషీన్‌ను సృష్టించారు.
విద్యుత్ కోతలు సర్వసాధారణమైన గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ఆమె, ప్రజలు ముఖ్యంగా మహిళలు మానవ శక్తిని మాత్రమే ఉపయోగించి బట్టలు ఉతకడానికి సహాయపడటానికి ఈ యంత్రాన్ని రూపొందించారామె. సైకిల్‌పై తొక్కడం ద్వారా, ఈ వాషింగ్ మెషిన్ కి శక్తినిస్తారు. ఇందువల్ల బట్టలు శుభ్రమవుతాయి.
విద్యుత్ పరిమితంగా లేదా అందుబాటులో లేని గ్రామాలలో ఆమె ఆవిష్కరణ చాలా ఉపయోగకరంగా ఉంటోందని అనుకుంటున్నారు. ఇది పర్యావరణ అనుకూలమైనదికూడా. సరసమైనదని వేరేగా చెప్పక్కర్లేదు. ఉపయోగించడానికి సులభమైనది. ఇది తక్కువ ఆదాయ కుటుంబాలు వారికి అనువైనది. 
రెమ్య డిజైన్ విద్యుత్తుపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా స్థిరమైన జీవనాన్ని కూడా ప్రోత్సహించడం విశేషం.
సృజనాత్మకత, దృఢ సంకల్పంతో యువత వాస్తవ ప్రపంచ సమస్యలను ఎలా పరిష్కరించగలరో చూపిస్తూ, భారతదేశం అంతటా ఆమె పనితనానికో గుర్తింపు లభించింది. రెమ్య కథ ఇతర విద్యార్థులను ఆచరణాత్మకంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తుందనడం అతిశయోక్తి కాదు. అలాగే ఆవిష్కరణ విషయానికి వస్తే వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది.

కామెంట్‌లు