న్యాయాలు-942
దర్దురా యత్ర వక్తార స్తత్ర మౌనమ్ హి శోభనమ్ " న్యాయము
****
దర్దురా అనగా కప్ప.యత్ర అనగా ఎక్కడ, ఎక్కడైతే.వక్త అనగా మాట్లాడేవాడు,ప్రసంగీకుడు,ఉపన్యాసకుడు.అస్తత్ర అనగా ఆ ప్రాంతంలో,ఆ చోట.మౌనం అనగా నిశ్శబ్దంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం.హి అనగా ఖచ్చితంగా. శోభనమ్ అనగా మంచిది,శుభకరమైనది, సౌందర్యవంతమైనది అనే అర్థాలు ఉన్నాయి.
కప్పలు మాటకారులయిన చోట మాట్లాడ కుండడమే/ మాట్లాడకుండా ఉండటమే శోభ/ మంచిది అని అర్థము.
ఎందుకంటే అవివేకులు అర్థం పర్థం లేకుండా మాట్లాడే చోట వివేకుల మాటలు వినేవారు, పట్టించుకునే వారు ఎవరూ ఉండరు. అలాంటి సమయంలో వివేకులు, విజ్ఞులు, విద్వాంసులు అయిన వారు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది.
దీనిని సమర్థిస్తూ, ఇదే విషయాన్ని తనదైన శైలిలో ప్రస్తావిస్తూ సంస్కృతంలో ఓ సుభాషితకారుడు ఇలా అంటాడు.
"కోకిలేన కృతం మౌనం ప్రావృట్కాలే సమాగతే!/యత్ర భేక పతిర్వక్తా తత్రాస్మాకం కుతో వాచకం!!"
అనగా వర్షాకాలం రాగానే కోకిల మౌనం వహించింది. మండూకరాజు ఎక్కడైతే వక్తగా వ్యవహరిస్తాడో, అక్కడ మావంటి వారికేమి మాటలుంటాయి అని అర్థము.
దీనిని వివరించి చెప్పాలంటే వర్షాకాలం వచ్చిన వెంటనే కోకిల మౌనంగా ఊరుకుండి పోయినట్లు- (కోకిల వసంతం వస్తేనే తన గళాన్ని సవరించుకొని కుహూ కుహూ రాగాలతో అలరిస్తుంది),ఇక మండూక శాస్త్రి మహోపన్యాసం ఇస్తూ ఉంటే, అసలైన విద్వాంసులమైన మాకు మాకు మాట్లాడడానికి అవకాశం ఎక్కడిది ? అని వాపోవడం ఇందులో మనకు కనిపిస్తుంది.
మరి కప్పలు చేసేది బెకబెకల అరుపులే తప్ప అందులో ఎలాంటి , ఏవిధమైన విజ్ఞాన వంతమైన విషయం ఉండదు. అందుకేనేమో ఇక్కడ కప్పలను మూర్ఖులతో పోల్చడం విశేషం.
మూర్ఖులంతా ఓ చోట కూడితే పనికిమాలిన విషయాలు, ఎవరికి వారే తమదే సరైనదనే వాదనలు, ఒప్పుకోకపోతే పెద్ద పెద్దగా అరుపులు ఉంటాయి. అక్కడ ఉన్నవారికి, విన్నవారికి వినడమే తప్ప మంచి చెడుల వివేచన గానీ, శాస్త్రాల గురించి సవివరంగా వివరించి చెప్పేందుకు గాని ఎలాంటి అవకాశమూ ఉండదు.ఒకవేళ చెప్పాలనే కోరికతో చెప్పినా ,వినడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండరు.కాబట్టి మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
అయితే అలాంటి చోట మౌనంగా ఉన్నంత మాత్రాన విద్వాంసుల ప్రతిభ,విషయావగాహన , వారికి ఇచ్చే గౌరవం ఎక్కడికీ పోవు. అలాగే అరుపులు కేకలతో తామేదో గొప్ప అని ఎంతగా చెప్పినా, ఎవరూ అలాంటి వారిని గౌలవించరు.విలువ ఇవ్వరు.ఇది విజ్ఞులైన అందరికీ తెలిసిందే .
ఇదే ఈ "దర్దురా యత్ర వక్తార స్తత్ర మౌనమ్ హి శోభనమ్" న్యాయము లోని అంతరార్థము.
దీనిని వేమన గారు చెప్పిన "అనువుగాని చోట అధికుల మనరాదు/ కొంచమైన నదియు కొదువ గాదు/ కొండ అద్దమందు కొంచెమై యుండదా?" అనే పద్యంతో కూడా పోల్చుకోవచ్చు. కాబట్టి అనవసరం, అప్రస్తుతం, అవమానం అనుకున్న చోట మౌనాన్ని ఆశ్రయిస్తే మంచిది. ఆ మౌనమే శోభను, గౌరవాన్ని ఇస్తుంది. మనం కూడా సమయానుకూలంగా పైన చెప్పిన విధంగా ఉందాం. గౌరవ మర్యాదలు పొందుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి