అమ్మ ఎందుకు పనికిరాదా?:- కవిమిత్ర,, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం.
బాల్యంలో ఆకలితో రోధిస్తే 
రక్తాన్ని చనుబాలుగా మార్చి నీ ఆకలి తీర్చేనే
మలమూత్రాదులను తుడిచి
పసిడి బొమ్మలా తయారుచేసి
పరవశించి ముద్దాడేనే

ఐదేండ్లు వచ్చినా ఎక్కడ పడిపోతావో అని
ఓపిక లేకపోయినా ఎత్తుకుని  తీసుకెళ్ళేనే
పై చదువులకు స్తోమతలేదని చదివించనని
నాన్న అంటే అక్షరం ముక్క వస్తే అన్నానికి లోటుండదని
నా తాళి నమ్మి పసుపుకొమ్ము కట్టుకుని ఉన్నత చదువులు చదివించేనే

నాన్నపోతే  దుఃఖాన్ని దిగమింగి నేనున్నానురా భయం లేదని
నీజీవితం నీ ఇష్టమని నీవు కోరిన పిల్లని పెళ్ళి చేసేనే
మీ పిల్లల బాధ్యతలు కూడా నే చూసిన నన్ను
ముడుతలు పడి వృద్ధాప్యాన మంచాన పడితే
గదిలో పెట్టి అమ్మ ఎందుకు పనికి రాదని
మీ దంపతులనడం
ఎంత వరకు సమంజసం.?
.............................


కామెంట్‌లు