కృష్ణ శతకం:- ఉండ్రాళ్ళ రాజేశం

1) కష్టమించుకైన కలమును కదిలించి
రచన సేద్యమందు రాసి నిలువ
దారి చూపగలవు దండిగా గణపయ్య
కల్మషంబు లేని కార్య కృష్ణ

2) బందిఖాననందు బాధతో దేవకి
పురుడు బోసుకుంది పుణ్యమాత
నాగుబాము నీడ నడకలో వసుదేవు
గొల్లలింట నిలిచె ఘల్లు కృష్ణ

3) అమ్మ వొడిన జేరి కమ్మని పాలను
తాగుతున్న తీరు తన్మయంబు
గోరుముద్ద తినుచు కోటి ప్రభల కాంతి
 వీధులందునై యశోద కృష్ణ

4) ఆలమందతోడ అడవంత తిరుగుతూ
గాన మధురిమందు కానలుండె
పిలుపు గాంచినంత పిల్లన గ్రోవికి
నడకసాగు వరుస నంద కృష్ణ

5) ఆటపాటలందు అల్లరి జేయుచు
ఉరుకు పరుగులందు తరువులూట
మాట ముచ్చటందు మమతానురాగాల
సిరుల కల్పదరువు చిన్ని కృష్ణ

6) ఉట్టి నందుకొనను పొట్టివారైనను
కుండ దోచినారు కూడి పలికి
గోకులాన బాల గోలల సవ్వడి 
వెలుగు రవళులందు వెన్న కృష్ణ


7) మాట ముచ్చటందు మురిపెంబు కొల్చుతూ
స్నేహశీలిగాను సిరుల పంట
చూపు భక్తియెపుడు సోదరాతత్వంబు
రాగ వినిమము బలరామ కృష్ణ

8) వెన్న దొంగయనుచు వేనోళ్ళ గొంతులు
కట్టినంత రోలు కదులుకుంట
తాటిచెట్ల కూల్చి తరగని నవ్వుతో
మధ్య నిల్చినాడు మాన్య కృష్ణ

8) మట్టి తినినగాని మనసంత సంబ్రము
నోరు తెరిచినంత కారు మబ్బు
లీలలన్నిగాంచి లీనమైన యశోద
 కనుల నిలిచిపోయె కాంతి కృష్ణ

10) విషము పాలనివ్వ వేషాన పూతన
వచ్చినంత గనియు పాలుతాగ
రక్తమంత పీల్చి రక్కసిని పడగొట్టి
చంపి యాడుతుండె శౌర్య కృష్ణ

11) ఆలమందలన్ని అడవిలో జీవులు
గిరికి పూజ జేయ తరలుతున్న
ఇంద్రుడుగ్రరూపు బాదేను వర్షంబు
గొల్లలంత పరుగు గోపి కృష్ణ

12) చేవగలిగి మురళి గోవర్ధన గిరిని
చిటికెనేలు నెత్తె చిత్రముగను
దాపు గాంచి జనులు దండిగా జేజేలు
పూజజేసినారు పూర్ణకృష్ణ

13) నల్ల రూపునున్న నవరస భరితంబు
నల్లనయ్య బాట నాట్యమయము
నలుపు తెలుపులనుచు నలిగేటి మనసులు
కలత చెందుతుండు కవన కృష్ణ

14) గొల్ల పల్లెలందు గోపాల కృష్ణుడు 
ఆడి పాడుతుండె అనుజులందు
మైత్రి సంబరంబు మమతల కోవేల
ప్రజల పక్షపాతి బాల కృష్ణ 

15) చెరువు గట్టునున్న చెలియల వలువలు
పట్టుకొనుచు చెట్టు పైకి చేరి
మనసు దోచినంత మహిమతో వస్త్రాలు 
జార విడిచినాడు నారి కృష్ణ


16) ప్రేమ వలపులందు పెరిగేను కన్నయ్య
మురళి గానమునందు తరుణిమణులు
తనువు పంచుకునిన తాండవమున
రక్షనుండె నెపుడు రాధ కృష్ణ

17) అష్టమందు పుట్టి కష్టాలు తొలగించ
వృద్ధి చెందుతుండె శుద్ది గాను
చేత వెన్నముద్ద బంతిలా బోనంబు
సకల సంబరాల సద్ది కృష్ణ

18) నింగి నేలలందు నిత్య లీలామృత
మురళి గాన రవళి మూర్తి పంచె
పచ్చనైన ప్రకృతి పసిడి పంటల రాసి
అడుగులందు నిలుచు నడువు కృష్ణ

19) మల్ల యుద్దమనుచు మధురకు చేరగా
గజమునందు పోరు గాయపరచి
దంత భుజములందు ద్వారంబు జేరగా
ఘల్లు మనిరి జనులు ఘనము కృష్ణ 

20) కదనమందు నిలిచి కంసమామను జంపి
కారగారమందు కదిలి వెళ్ళి
తల్లి దండ్రులందు తనయుడు సాగగా
దేవకి వసుదేవ దీక్ష కృష్ణ

21) సకల శాస్త్రమందు సాంధీప గురువర్య
విద్య నేర్పినాడు విలువలందు 
గుర్తుగాను జూపి గురుదక్షణముగను
కొడుకు నిచ్చినాడు గోపి కృష్ణ

22) పుత్తడైన బొమ్మ పూర్ణాంగి రుక్మిణి 
గౌరి పూజనందు చోరుడిగను
ఎత్తుకెళ్ళుకుంట నెదిరించి రుక్మి ని
పెండ్లి జేసుకునెను ప్రేమ కృష్ణ


23) నింగి చంద్రవంక నీలాప నిందకు
జాంబవంతు పోరు జడిసినంత
మణిని తెచ్చినంత మామ సత్రాజిత్తు
సత్యభామ నిచ్చె సరస కృష్ణ 

24) అష్ట భార్యలందు యిష్ఠ సఖుడిగను
మాట లొచ్చినంత మధన పడక
నటన సూత్రధారి నారథ సాక్షిగా 
తూల భారమందు తులసి కృష్ణ


25) సక్కనైన రూపు సంద్రంబు మధ్యన
రాజధాని జేసె రాజ్యమేల
దండి సొబగులున్న ద్వారకా పురంబు
చుట్టు నీళ్ళ నడుమ మేటి కృష్ణ

26) ద్వారమందు నిలిపి దండించ బోవగా
బాల్య మిత్రుడిగని వచ్చి నిలిచి
స్వాగతంబు ఘనము సకల మర్యాధతో
చిత్ర పరచినడు కుచేల కృష్ణ 

27) ఆసనంబు వేసి హస్తము తోడను
కడిగె పాదములను కాంక్షతోడ
అటుకులున్న వస్త్ర మూట విప్పి తినిన
పేదరికము తొలగె వినయ కృష్ణ


28) నరుల బాధపెట్టు నరకాసురుడి చంప
నారిమణిగ తరలె నాథుడుగను
మూర్చబోయినంత మురళి ధనస్సుతో
సత్యభామ పోరు సమర కృష్ణ


29) తల్లి బాణమందు తనయుడి మరణంబు
సృష్టి ధర్మమందు శరణులేదు
భక్తినందు ముక్తి పదహారు వేలుగా
చెరన విడుదలైరి జీర్ణ కృష్ణ


30) అన్న మాటలెపుడు కన్నయ్య మీరక
సాగుతున్న తీరు సకల శుభము
ప్రజల రక్షనందు బలరామ కృష్ణులు
జగతి పథమునందు జయము కృష్ణ

31) వర్ణ శోభితంబు వసుదైక చరితము
పచ్చ తోరణాన పరవశంబు
ప్రకృతాంబ నందు పత్ర సంబరము
చందనాల విందు బృంద కృష్ణ

32) మీరకుండ సాగి మేనత్త చెంతన
 పాండవేయులందు పక్షపాతి
 మేన బావలందు తానుండు నెప్పుడు
కోటి ప్రభల వెలుగు కుంతి కృష్ణ

33) కష్ట మించుకున్న కరములందున మొక్కి
వేడుకొనిన వచ్చి వేగిరమున
పాండ వేయులందు పాండురంగడి రూపు
దాపునందు నిలుచు ధరణి కృష్ణ

34) లక్క గీమునందు చిక్కక దహనాన
మారు వేషమందు మార్గమెంచి
తల్లి బిడ్డలందు చల్లని చూపులై
దారి చూపినాడు దర్మ కృష్ణ

35) కానలందునున్న కష్టాలు పడుతున్న
కృష్ణ నామమందు కృపనుబొంది
పంచ సోదరులుగ ప్రజలలో సాగనూ
కాచుతున్న తీరు కరము కృష్ణ

36) సకల రాజులున్న స్వయము వరంబున
పార్థు గెల్చినాడు పత్నినొంద
ధరణి మెచ్చినట్టి ద్రౌపతిల్లాలుగా
పాండవేయులింట ప్రణతి కృష్ణ

37) పూజలున్న కుంతి పుత్రుడి ఫలమును
ఐదు పాళ్ళననెను యజ్ఞముండి
మాట తప్పనట్టి మహిన కళ్యాణము
పంచ భర్తలున్న పాలు కృష్ణ

38) శక్తినంత కూడి భక్తితో ద్రౌపతి
నిత్య పూజ జేయు నిశ్చలుడికి
కష్ట సుఖములందు కలియుగ దైవమై
సోదరత్వమెపుడు చూపె కృష్ణ

39) రెండు సగములైన రేడు జరాసంధ
మగధ రాజ్యమందు మాన్యుడిగను
కంస మామగాను కక్ష్యతో నిండియు
పోరు సలుపుతుండె పూజ్య కృష్ణ

40) బందిఖానలందు బలమైన రాజుల
చెరను తుంచ సాగి వరలినంత
భీకరమున పోరు భీమ జరాసంధ
రెండు ముక్కలనెను ఖండ కృష్ణ

41) రాజసూయ యాగ రంజిల్ల జేయగా
మయుడి పిలిచినాడు మాన్యుడిగను
నింగి నేల నింట నిజము లేదని శిల్పి
అద్భుతాల గీము ఆజ్ఞ కృష్ణ 

42) మహిన రాజులొచ్చి మాయసభలో నిల్చి
మురిసి పోయినారు ముదముగాను
చిత్రముండెననిరి శిల్ప చాతుర్యము
మంత్ర ముగ్దులైరి మాయ కృష్ణ

43) చుట్టు బలగమందు చూడ సుమోదనా
నేల నింగిలందు విర్ర వీగి
జలములందు పడిన చెలియల నవ్వులు 
కక్ష బలమునొందె కమల కృష్ణ

44) ఇంద్రప్రస్థ నగర యింపైన సొబగులు
రాజసూయమందు యజ్ఞమొంది
ఆగ్ర తాంబులమును అందించి కృష్ణుడి
ఆత్మనొందినారు సోత్ర కృష్ణ


45) నల్లనయ్య ననుచు గొల్లవాడివనుచు
నూరు తప్పులాడి మీరినంత
అత్త మాట తీరి అపనింద శిశుపాల
సభన తలను తుంచె చక్ర కృష్ణ

46) మారు వేషమందు మాట్లాడి పార్థుడు
మోహ మొందినాడు ముచ్చటందు
కలలనున్న బావ కనిపించగ సుభద్ర 
ప్రేమలొలక బోసె పేర్మి కృష్ణ 

47) వలదు పెండ్లి యనెను బలరాము మొండిగా
చెల్లి దుఃఖమందు చెంత నిలిచి 
పోటి బాజలందు బొమ్మల పెండ్లని
మాట దాట వేసె మేటి కృష్ణ

48) అర్జునుడి సుభద్ర హస్తముల కలిపి
పెండ్లి జేసినాడు ప్రేమ జయము
అన్న మనమునందు నాత్మ ప్రభోదింది
శాంత పరచినాడు శౌర్య కృష్ణ

49) మాయ సభను జూసి మాయతో జూదాన
గెలుపు కొరకు శకుని కలలు పండి
ధర్మరాజు మదిన దాగున్న జూదము
బయట పడిననంత బాధ కృష్ణ 

50) మాయ పాచికలకు మత్తులో రాజ్యంబు
ఆలి సోదరులను యాడి వోడి
వరల వలెను కాన పన్నెండు ఏండ్లుగా
పాటి యెక్కడుంది ప్రణవ కృష్ణ

కామెంట్‌లు